ఐతరేయోపనిషత్తు: Aitareya Upanishattu

Ramakrishna Math, Hyderabad
Free sample

వింతల్లో వింత!

ఋగ్వేదానికి చెందిన ఐతరేయ ఆరణ్యకం రెండవ విభాగంలో 4, 6 అధ్యాయాలుగా ఈ ఉపనిషత్ పొందుపరచబడింది. ఈ ఉపనిషత్ను లోకానికి అందించినవారు ఐతరేయ మహర్షి. సంసారమనేది మహాసాగరమని, ప్రాపంచిక సుఖాలను అనుభవించాలనే తపన అలలవలె ఉద్ధృతమయ్యే వైనాన్ని, ఆ మహాసాగరాన్ని దాటే పయనంలో సాధుసాంగత్యం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ శంకరులు అద్భుతమైన వివరణను ఇచ్చారు. సృష్టిలో మనిషి ఉత్కృష్టుడనే భావనను తెలియజేస్తూ, దేవతలను, ఆహారాన్ని సృజించినవైనం ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది. శరీరమంతా వ్యాపించి ఉండే నాడులు హృదయం నుండి బయలుదేరి ఆదేశాలు ఇవ్వబడి, అనుభవాలు పొందే వైనం తెలుపుతూ ప్రార్థన, భగవన్మయ జీవనము వంటి మూలముగా పవిత్రము, శక్తివంతము అయిన మనస్సుకు మాత్రమే అవి గోచరమవుతాయని ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది.

Our other books here can be searched using #RKMathHyderabad

Read more
Collapse
Loading...

Additional Information

Publisher
Ramakrishna Math, Hyderabad
Read more
Collapse
Published on
Oct 12, 2018
Read more
Collapse
Pages
48
Read more
Collapse
ISBN
9789386857521
Read more
Collapse
Features
Read more
Collapse
Read more
Collapse
Language
Telugu
Read more
Collapse
Content Protection
This content is DRM protected.
Read more
Collapse
Read Aloud
Available on Android devices
Read more
Collapse

Reading information

Smartphones and Tablets

Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.

Laptops and Computers

You can read books purchased on Google Play using your computer's web browser.

eReaders and other devices

To read on e-ink devices like the Sony eReader or Barnes & Noble Nook, you'll need to download a file and transfer it to your device. Please follow the detailed Help center instructions to transfer the files to supported eReaders.
ప్రతిపదార్థ తాత్పర్య సహితం

కృష్ణ యజుర్వేదంలోని తైత్తిరీయ ఆరణ్యకంలో అంత్యభాగంగా నారాయణోపనిషత్తు పొందుపరచబడినది. ఇందు పరబ్రహ్మ తత్త్వంకన్నా యజ్ఞవిధికి సంబంధించిన వివిధ సంహితా భాగమంత్రాలు ఉండటంచే దీనికి యాజ్ఞికోపనిషత్ అని కూడా పేరు ఉంది. నిత్యానుష్ఠానమైన సంధ్యావందనాది కర్మలలో అగ్న్యాది దేవతల ఆవాహనకు నిర్దేశించిన మంత్రాలు, రుద్రాది దేవతల అభిషేకం, అర్చన సమయాల్లో వినబడే మంత్రాలు ఇందులోనివే. అందుచేతనే దీనిని మహానారాయణోపనిషత్ అని ఆంటారు. గ్రంథంలోని మంత్రాలకు సరళమైన శైలిలో తెలుగు వ్యాఖ్యానము ఇవ్వబడినది. జిజ్ఞాసువులకు ఉపయుక్తంగా ఈ పుస్తకం నిలుస్తుందనేది మా ఉద్దేశ్యం.

Our other books here can be searched using #RKMathHyderabad

అంతా ఎవరిచే?

‘కేన’ అనే పదంతో మొదలవడం వలన ఈ ఉపనిషత్ను కేనోపనిషత్ అని పేర్కొనడం జరిగింది. ఈ ఉపనిషత్ సామవేదంలో పొందుపరచడం జరిగింది. 35 మంత్రాలతో 4 భాగాలుగా ఈ ఉపనిషత్ దర్శనమిస్తోంది. ‘శరీరము, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణము ఇవన్నీ ఎవరి మూలముగా పనిచేస్తున్నాయి’ అనే ప్రశ్నతో ఈ ఉపనిషత్ మొదలవుతుంది. ఆత్మయొక్క అస్థిత్వాన్ని తెలియజేస్తూ, ఇంద్రియాలతో ప్రాపంచిక వస్తువులను తెలుసుకున్నట్లు ఆత్మను తెలుసుకోలేమని, మనం ఆరాధించే విగ్రహాలు, చిత్రపటాలు మనం భగవదనుభూతిని పొందడం కోసం ఒక మెట్టు మాత్రమేనని, ఆత్మను సంపూర్ణముగా తెలుసుకోమని ఈ ఉపనిషత్ బోధిస్తుంది. ఆత్మానుభూతి ద్వారా పొందే శక్తే నిజమైన శక్తి అని, అపరోక్ష జ్ఞానం వలన తాను శాశ్వతుడు, నాశనం లేనివాడు అని గ్రహించిన వ్యక్తి అమరత్వ స్థితిని పొందుతాడని ఈ ఉపనిషత్ వివరిస్తుంది.

Our other books here can be searched using #RKMathHyderabad

మరణానంతరం

కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ ఆరణ్యకం అనే విభాగంలో కఠోపనిషత్తు చోటుచేసుకుంది. వాజశ్రవస ముని కుమారుడైన నచికేతుడు యమధర్మరాజుకి మధ్య జరిగిన సంభాషణమే ఈ ఉపనిషత్తుగా రూపొందించబడింది. ఈ ఉపనిషత్తులో సర్వోత్కృష్ఠ సత్యాలు పొందుపరచబడ్డాయి. భౌతిక స్థాయిలో సుఖంగా జీవించడం ప్రేయోమార్గమనీ, జీవిత సాఫల్యానికై కృషిచేయడం శ్రేయోమార్గమనీ ఈ ఉపనిషత్తు పేర్కొంది. భోగలాలసత్వానికి పెద్దపీట వేసే ప్రస్తుత సమాజానికి మార్గనిర్దేశం చేసే విధంగా ఈ మార్గాలను ఉపనిషత్తు వివరించింది. ప్రతీ మానవునికి ఒక లక్ష్యం ఉండాలనీ, ఆ లక్ష్యసాధనకై అలుపెరుగని ప్రయత్నంతో ముందుకు సాగాలనీ ఈ ఉపనిషత్తు ప్రబోధిస్తుంది. అయితే అది అంత సులభమైనది కాదు, కత్తిమీదసాము వంటిది. ధీరుడైనవాడు ఇంద్రియాలను నియంత్రించి అంతర్ముఖం చేసి అంతరాత్మను దర్శిస్తాడు. అవిద్య నుండి మేల్కొనండి, లేచి ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యసాధన చేసేంతవరకూ ఆగవద్దు, ముందుకు పదండి అని ఈ ఉపనిషతు ఎలుగెత్తి చాటుతుంది. ‘Arise! Awake! And stop not till the goal is reached’ అని స్వామి వివేకానంద విశ్వమానవలోకానికి పిలుపునిచ్చింది ఈ ఉపనిషత్ మంత్రాల తాత్పర్యమే! చక్కని స్ఫూర్తిదాయకమైన ఈ ఉపనిషత్తు సాధకుల లక్ష్య భేదనలో మార్గనిర్దేశం చేస్తూ తోడ్పడాలన్నదే మా ఆకాంక్ష.

Our other books here can be searched using #RKMathHyderabad

©2020 GoogleSite Terms of ServicePrivacyDevelopersArtistsAbout Google|Location: United StatesLanguage: English (United States)
By purchasing this item, you are transacting with Google Payments and agreeing to the Google Payments Terms of Service and Privacy Notice.