ప్రజలు ఆమెను చంపేశారు. నైతికత ఆమెను చంపేసింది. మతాలు ఓడిపోయాయి. అమ్మలకే అమ్మ ఈరోజున అసహాయ స్థితిలో వధశాల నేల పై పడి ఉంది. తెగిన గొంతుక నుంచి రక్తం పొంగింది. చర్మం వలిచేశారు. కళ్ళ వెంబడి కన్నీళ్ళు ఎండిపోయాయి, చివరకు స్పృహ కూడా. మనుష జాతి యొక్క జీవం, పౌష్టికాహారం, కూడు, ప్రేమలకి మూల కారణం అయిన గోమాత ఈనాడు చచ్చిపోతోంది. ఓ ప్రపంచమా బతికే ఉన్నావా?
ఈ పుస్తకం తన తల్లి కోసం ఒక మనిషి చేస్తోన్న పోరాటం. గోమాత. ఈ పుస్తకం కసాయి మనుషుల అబద్దాలను, గోమాంస ప్రియుల హింసాత్మక మూలాలను నాశనం చేస్తుంది. ఈ పుస్తకం మాంసాహారం పౌష్టికమనే అపోహలను తొలగిస్తుంది. హిందూ మతంలో గోమాంస భక్షణ ఉండేదన్న అభాంఢాలను వందల కొలది వేద మంత్రాలతో, ధర్మ శ్లోకాలతో మరియు తిరుగులేని తర్క సూత్రాలతో ఇది తుడిచేస్తుంది.
ఈ పుస్తకం గోమాంసం తినొద్దనే వారికి అర్జీ కాదు. పైగా గోమాంసం తినేవారు ఈ పుస్తకం చదివాక మళ్ళి తినగలరా అని ఛాలెంజ్ చేసే పుస్తకం.
* ఈ పుస్తకం ఉక్కు గోడల్లాంటి కబేళా గదులు దాటి బయటకు రాలేని మూగ జీవాల గొంతుక.
* ఈ పుస్తకం ఆత్మను వెతికే వారి గుండే పిండేసే పుస్తకం.
* ఈ పుస్తకం జంతు ప్రేమికుల ఆయుధం.
* ఈ పుస్తకం గోమాతను ప్రేమించే వారి సమస్యల పరిష్కరిణి.
ఈ పుస్తకం చదివాక మీరు, మీ ప్రియమైన పిల్లలు, వారి పరివారం హాయిగా, ఆరోగ్యంగా, కలకాలం బతకాలంటే ఏమి చేయాలో తెలుస్తుంది. రక్తపు మరకల చరిత్రతో, మూగ జీవల ఆక్రందనలతో మరణానంతరం జీవితం మరియు మరు జన్మకి ఇలా వెళ్ళడం మంచిదా, కాదా అన్నది తెలుస్తుంది. మీరు మానవత్వాన్ని, కసాయితనం పై నిర్ణయాత్మకంగా, అధికారికంగా ఎలా గెలిపించగలరో తెలుస్తుంది.
– ఉక్కు చేతితో, తరుక్కు పోయే గుండె తో, ఓ గోమాత ప్రేమికుడు.
సంజీవ్ నెవార్ వేదాలు, గీత మరియు సనాతన హిందూయిజాన్ని చదివిన పండితుడు. ఈయన వేదాలపైనా, యోగశాస్త్రం పైనా, ఆధ్యాత్మికం పైనా మరియు హిందూయిజంపై వేసిన వక్రీకరణల పైనా పలు పుస్తకాలు రచించారు. అగ్నివీర్ అనే సంస్థను స్థాపించి కుల సమానత్వం పైనా, లింగవివక్ష పైనా, ప్రాతీయ ద్వేషాలపైనా ఇటు భారతదేశం లోనూ అటు విదేశాలలోనూ ఆధ్యాత్మిక విప్లవం ద్వారా పోరాడుతూ కృషి చేస్తున్నారు. హిందూ ఏకత్వ యజ్ఞం ద్వారా ప్రాతాలలోనూ, కులాలోనూ సమానత్వం తీసుకుని వచ్చి సమసమాజం నిర్మించాలని కృషి చేస్తున్న వారిలో ముందంజలో ఉన్నారు. అంతేకాక వీరు సమాజంలో ఉన్న అసమానత్వం వల్ల నిరాశతో కృంగిపోయి, ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించే ప్రజలకు ఉత్తేజపూరిత కవితలు రాస్తూ, స్ఫూర్తి దాయక మార్గాలు చూపిస్తూ అనర్గళంగా ప్రసాగాలు ఇస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. వీరు ప్రతిష్ఠాత్మకమైన IIT-IIM ల పూర్వవిధ్యార్ది. పేరొందిన డాటా సైంటిస్ట్, రిస్క్ మానేజ్మెంట్ నిపుణులు. జన్మ ఆధారంగా ఏర్పడే కులవ్యవస్థ సనాతన స్ఫూర్తికి విరుధ్ధమని దీన్ని రూపుమాపి అసలైన వేదకాలపు విలువలతో నింపాలని కంకణం కట్టుకొన్న యోధుడు.