నా ప్రభువు తల్లి (Telugu): Mother of my Lord

Faith Scope
5

 Contents:

యేసుయొక్క సహోదరులు మరియు అక్కచెల్లెండ్రు

''వారు ఇరువురును కాపురము చేయక ముందే,'' అను ఈ వాక్యము యేసు పుట్టిన తరువాత మరికొందరి పిల్లలకు మరియమ్మ జన్మనిచ్చింది అని అర్థము చెప్పుచున్నారు.ఇది నిజమా?

ముందు మరియమ్మ పవిత్రురాలే కానీ అటు తరువాత...

ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబు . . . అని పౌలు చెప్పుచున్నారు

తొలిచూలు కుమారుడు

యేసు పుట్టిన తరువాత, మరియమ్మ మరలా పిల్లలకు జన్మ నివ్వకపోతే, యేసు సహోదరులు అని ఎందుకు వ్రాయబడి యున్నది?

క్రీస్తు సహోదరులు

ప్రభువు ప్రవేశించిన ద్వారములలో నరులకు ప్రవేశము లేదు. . .  అని యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు తెలియజేసెను

మొట్టమొదటి పూజ

పౌలు యొక్క కనిన కుమారుడు – నిజమైన కుమారుడు

క్రీస్తు ఎన్నుకొన్నవి

విడ్డూరమైన విమర్శ  -  పదిమంది సాక్ష్యము

యేసు మరియమ్మను కాదని అన్నప్పుడు మనము ఎందుకు ఆమెకు ప్రాముఖ్యత ఇయ్యాలి?

మరియమ్మ పాపాత్మురాలు కాకపోతే, ఆమె ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఎందుకు ఆనందించుచున్నది?

భూమిపై పవిత్ర జీవితము జీవించి మరణించిన పునీతులు (Saints) భూమి మీద నివసించు వారికి సహాయము చేయుదురా?

ఆది కాండములో తల్లి మరియను గూర్చిన ప్రవచనము

క్రొత్తబండి

''కన్యమరియ మరియు పవిత్ర ఆత్మ ఒకరికొరకు ముద్దు పెట్టుకొనిరి,''         . . . కోరహు కుమారులు ప్రవచించిరి.

పరిశుద్ధాత్మ- మరియమ్మ ఇద్దరు ఒక్కటైరి మరియమ్మ నిష్కళంకురాలు,  మరియు ఆమెను ధన్యురాలు అందురని. . . . పరమ గీతములో ప్రవచనములు చెప్పుచున్నవి

మోషేయొక్క  మూడవ ఆజ్ఞ

సిలువపై మూడవ మాట

ఖురాన్‌- ఈ - షరీఫ్‌ మరియమ్మను గూర్చి ఏమి చెప్పుచున్నది?

మరియమ్మను ఆరాధించ వచ్చునా?

Read more
Collapse
4.0
5 total
Loading...

Additional Information

Publisher
Faith Scope
Read more
Collapse
Published on
Apr 16, 2016
Read more
Collapse
Pages
68
Read more
Collapse
ISBN
9781944890018
Read more
Collapse
Read more
Collapse
Read more
Collapse
Language
Telugu
Read more
Collapse
Genres
Religion / Biblical Studies / Bible Study Guides
Religion / Christian Church / General
Religion / Christianity / Catholic
Religion / Christianity / Protestant
Read more
Collapse
Content Protection
This content is DRM protected.
Read more
Collapse
Read Aloud
Available on Android devices
Read more
Collapse
Eligible for Family Library

Reading information

Smartphones and Tablets

Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.

Laptops and Computers

You can read books purchased on Google Play using your computer's web browser.

eReaders and other devices

To read on e-ink devices like the Sony eReader or Barnes & Noble Nook, you'll need to download a file and transfer it to your device. Please follow the detailed Help center instructions to transfer the files to supported eReaders.
 జెకర్యా ఒక ప్రవక్త :-  జెకర్యా 1:1, ''దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా''  ఈ విధముగా జెకర్యాకు యెహోవా వాక్కు ప్రత్యక్షము కాగా జెకర్యాకు ప్రవక్తగా ఒక స్థానము లభించింది.  దేవుని ప్రత్యక్షత లేనివారు ప్రవక్తగా ఎన్నిక కాలేరు.  కనుక జెకర్యా ఒక గొప్ప ప్రవక్తగా దేవునిచే ఎన్నిక కాబడి బైబిలు గ్రంథములో అతని పేరు మీద ఒక పుస్తకము లిఖించబడియున్నది.  కాని ఈ జెకర్యా ఎవరు?  ఎందుకు దేవుడు ఆయనను ఎన్నిక చేసాడు?  ఎందు నిమిత్తము ఈ ప్రత్యక్షతలు అనుగ్రహించబడినవి?  ఈనాటికి మనకు అర్థము కానటువంటి విషయమే.  నేను క్రైస్తవునిగా మారినప్పటినుండి అనేకులైన దైవజనులు బోధలు విన్నాను కాని వారి బోధలో జెకర్యాను గూర్చిన బోధను నేను వినలేదనే చెప్పవచ్చును.  నా ఈ క్రైస్తవ జీవితములో జెకర్యా ప్రవచనములోని వాక్యము అను దైవసేవకుల బోధలో అత్యంత తక్కువ సార్లు వినుట జరిగింది.

ఈ పుస్తకము వ్రాయుట మొదలు పెట్టినప్పుడు నాలో జెకర్యా ఒక గొప్ప దైవ ప్రత్యక్షత కలిగిన ప్రవక్త అని నేను గుర్తించితిని.  ఇలాంటి ప్రవక్త 14 అధ్యాయములు కలిగిన ఒక గ్రంథమును రచించుట జరిగింది.

జెకర్యాయొక్క కాలము :-  జెకర్యా దర్యావేషు రాజుయొక్క కాలము నాటివాడు.  బైబిలు చరిత్ర ఆధారముగా ఈ జెకర్యా సుమారు క్రీస్తు పూర్వము 500 - 510 సంవత్సరముల క్రితమువాడు.

జెకర్యాయొక్క వంశావళి :-  జెకర్యా 1:1 ప్రకారము ఈ జెకర్యా బెరక్యాయొక్క కుమారుడు.  ఈ బెరక్యా ఇద్దోకునకు పుట్టినవాడు.  అనగా జెకర్యాయొక్క తాత ఇద్దోకు అని మనము చెప్పవచ్చును.

జెకర్యాయొక్క దర్శనములు :-  ఈ పుస్తకములో ఈ దర్శనములు సంపూర్ణముగా వివరించుట జరిగింది.  ఈ దర్శనములు కొన్ని మాత్రమే అయినను దీనిలో చాలా ఆత్మీయ అర్థములు కలిగియున్నట్లుగా మీరును ఈ పుస్తకము చదివి గ్రహించగలరు.

జెకర్యా ఒక హతసాక్షి :-  జెకర్యా ప్రవక్తలలో అగ్రగణ్యుడైన లేక హతసాక్షులలో అగ్రగణ్యుడైన క్రీస్తుకు ముందు చంపబడి మరణించినవాడు.

క్రీస్తు ప్రభువు ప్రవక్తలలో చివరివాడు కనుక ఒక గొప్ప ప్రవక్తగా ఈ లోకములో నూతన నిబంధనను ఏర్పరచుట జరిగింది.  జరగబోవు ప్రత్యక్షతలు ఎన్నో ముందుగా ప్రవచించుట జరిగింది.  ప్రవక్త ఎన్ని విధములుగా యోగ్యతను  కలిగియుండునో అందరికన్నా ఎక్కువ యోగ్యతను క్రీస్తు ప్రభువు ఈ లోకరీత్యా  కలిగియుండెను.  అలాగే క్రీస్తు ప్రభువు సాధారణ మరణమును పొందినవాడు కాదు.  తన 33 1/2 సంవత్సర కాలము తరువాత యూదులు సిలువపై దారుణముగా క్రీస్తు ప్రభువుని చంపుట జరిగింది.  సీలలు చేతులకు కాళ్ళకు కొట్టి ముళ్ళ కిరీటము ద్వారా రక్తమును నేలపై చిందింపజేసి చంపుట జరిగింది.  అంతేకాకుండా యూదులు క్రీస్తు ప్రక్కలో బల్లెముతో పొడిచి చనిపోయినట్లుగా నిర్థారించుకొన్నారు.  ఇది హత్యయే కదా!  

కనుక హతసాక్షులో అగ్రగణ్యుడు క్రీస్తు ప్రభువే, ఎందుకంటే ఏ తప్పు చేయని వాడుగా తన శరీరమును బలిగా సిలువపై అర్పించుట జరిగింది.  

కనుక హేబెలుతో మొదలై క్రీస్తుతో పాత నిబంధనలోని ప్రవక్తల బలి సంపూర్తియైనట్లుగా మనము గ్రహించాలి.  అయితే జెకర్యా కూడా హతసాక్షుల వలె చంపబడినవాడు.  కాని క్రీస్తుకు కొంచెము ముందు చంపబడినవాడు. అనగా జెకర్యా తరువాత క్రీస్తు ప్రభువే హతసాక్షి అవుట జరిగింది.  ఇదే విషయమును క్రీస్తు ప్రభువు చెప్పుట జరిగింది.  

మత్తయి 23:35, ''నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠము నకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.''  

ఈ విధముగా క్రీస్తు ప్రభువే స్వయముగా హేబెలు రక్తమును ప్రస్తావిస్తూనే జెకర్యా చంపబడిన తీరును ప్రస్తావించుట జరిగింది.  ఆనాటి ఇశ్రాయేలీయులు ఈ జెకర్యాను బలిపీఠమునకు దేవాలయమునకు మధ్యన చంపుట జరిగింది.  అంటే ఈ ఇశ్రాయేలీయులు దేవుని ప్రవక్తలను చంపుటకు ఎంత దారుణమైన చేయ సంసిద్ధులై యున్నట్లుగా మనకు తెలియుచున్నది.  

ఈ విధముగా క్రీస్తునకు కొంచెము ముందు అనగా 500 సంవత్సరములకు ముందు తన ప్రాణమును బలిగా అర్పించి హతసాక్షిగా మారినవాడు జెకర్యా.  జెకర్యాకు క్రీస్తుకు మధ్య హతసాక్షులు లేరు.  బాప్తిస్మమిచ్చు యోహాను తల నరకబడి చంపబడినను, ఆయనను చంపుటకు ఉద్దేశ్యము వేరు.  దేవుని రాజ్య విస్తరణ కోసరము ఆయన చంపబడలేదు అనగా దైవరాజ్య సువార్త వ్యాప్తి జరువీగట ఇష్టము లేనివారు ఆయనను చంపలేదు.  

రాజకుమార్తెయొక్క తల్లి చేసిన తప్పును కప్పిపుచ్చుకొనుటకును, పగ తీర్చుకొనుటకును బాప్తిస్మమిచ్చు యోహాను హత్య జరిగింది.  ఈ విధముగా జెకర్యా దేవుని రాజ్య సువార్త కార్యక్రమములో ప్రవక్తగా ప్రత్యక్షత కలిగియుండి చివరకు హతసాక్షిగా గతించుట జరిగింది.

ఈ విధముగా ఇంత గొప్ప యోగ్యతను పొందిన జెకర్యా ఒక ప్రవక్తగా ఉండగా అనగా తాను హతసాక్షి కాక మునుపు దైవవాక్కు ఆయనకు ప్రత్యక్షమై ఆయనచే వ్రాయించి ఈ చిన్న గ్రంథము నా యీ ఆత్మీయ జీవితములో కొన్ని రహస్యములు నాకు తెలియజేసినది అనుటకు సందేహము లేదు.  ఏనాడు ఎప్పుడు వినని రహస్యములు నాకు ఈ గ్రంథము ద్వారా దేవుడు తెలియజేయుట జరిగింది.  ఈ రహస్యములను ఇప్పుడు మీ ముందు పుస్తక రూపములో ఉంచుచున్నాను.  

కనుక పాఠకులు ఈ చిన్న పుస్తకమును చదివి ఆత్మీయ ఉన్నతిని పొందమని ప్రభువు నామములో మిమ్మును అడుగుచున్నాను.

తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీకు తోడై యుండునుగాక!

 దేవుడు ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్కరు ఏదో ఒక మార్గాన్ని ఆచరిస్తుంటారు, ఎందుకు? ప్రశాంతమైన జీవితం కోసం మరియు చివరకు చనిపోయిన తరువాత స్వర్గ ప్రాప్తి కోసరమే కదా! వీటి కోసం మంచిగా జీవిస్తూ వారి ధర్మాన్ని పాటిస్తుంటారు. ఈ ప్రపంచములో అనేకమైనటువంటి మార్గములు వున్నాయి. వాటిలో మంచిది ఏది అనేది తెలుసుకోవాలంటే చాలా కష్టము, దానిని ఆచరిస్తున్న వారికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది లేదా ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ దేవుడినే నాకు సరైన మార్గమును చూపమని ప్రార్ధించిన వారికి ఆ నిజమైన మార్గము గురించి తెలుస్తుంది. ఇలా ఆ మంచి మార్గాన్ని కనుగొని ఆనందముగా జీవిస్తున్న వారు తమ మిత్రులకు దానిని గురించి తెలియ చెప్పక పోతే వారిని ఏమంటారు? వారిని మిత్ర ద్రోహులనరా? ఇటువంటి మిత్ర ద్రోహిగా ఎవ్వరూ కాకూడదనే నా ఈ చిన్న ప్రయత్నము.

                                                మిత్ర  ద్రోహిగా ముద్ర పడుట ఇష్టములేని మీ మిత్రుడు,

 నేను ఈ పుస్తకము వ్రాయుటకు తలంచినది వేరు నేను వ్రాసినది వేరు.  నేను నా జీవితములో పండుగలు - ఉత్సవాలు వంటివి అన్యుల కోసం చేస్తున్నారులే అనుకొని నిజక్రైస్తవులకు వీటితో ఏమి పని లేదని భావించేవాడిని.  కాని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించి, ఈ చిన్న పుస్తకమును వ్రాయించుట జరిగింది.  ఇందులో మన ఇహలోక జీవితములో శరీర సంబంధముగా ఇవి సాధనాలని, ఇవి కొంచెం మట్టుకు ప్రయోజనాలని తెలియజేయబడింది.  ఇలాంటి సాధనాలు నరులను దేవునివైపు కొంతమట్టుకు ప్రయోజనకరమై లాగగా, వారిని దైవసంబంధులమైన మనము ఆత్మలో ఎదుగునట్లుగా వారిని వాక్య పరిచర్యల యందు నిత్యము ప్రేరేపిస్తూ - వారిని అదే స్థితిలో ఉండనియ్యక దినదినము దేవునిలో అత్యున్నత స్థానమును పొందువారుగా చేయువారుగా మనము ఉండాలి.  ఇందులో కూడ స్వార్థమును వీడి నరులు దేవుని దరికి వచ్చుటకు, క్రైస్తవులమైన మనము ఎంతో ఆనందముగా ఈ పండుగలు - ఉత్సవాలు జరిగించవలసియున్నది.  ఈ స్థితి ప్రభువునకు యోగ్యమైనదియు ప్రియమైనదిగా ఉన్నది.  కనుక నేను ఈ చిన్న పుస్తకము ద్వారా పండుగలు - ఉత్సవాలు - మ్రొక్కుబడులు - విగ్రహాలు మొదలైనవన్ని వాటి గురించి క్షుణ్ణముగా పరిశుద్ధాత్మ కృపతో ప్రభువు ప్రేమ దయ కనికరము వలన వ్రాయగలిగాను.  కనుక ఈ పుస్తకము సంపూర్తిగా చదివి దేవునిలో మరింత జ్ఞానమును పొంది సిగ్గు విడిచి ప్రభువు కార్యములు కొనసాగించుదముగాక!  ప్రభువు కార్యములలో మన హస్తము కొంచెము మట్టుకు ఉన్న యెడల మనము ధన్యులమే!
 ప్రభువు నందు ప్రియసోదరీ! సహోదరులారా! ఒక చిన్న విషయమును ఎక్కువ చేసి ప్రయత్నించితే, అది కొండను త్రవ్వి ఎలుకను పట్టిన సామెత అవుతుంది.  అవును, ప్రియపాఠకులారా, హేతువాదులు ఎక్కువ చేసి ప్రయత్నించి కొండంత పెద్ద పుస్తకమును తయారు చేసారు. కాని వారు ఒక గ్రంథము నుంచి మరియొక గ్రంథమును వ్రాయు లిపిగారి ఒకటి రెండు తప్పులను పట్టగలిగిరి.

బైబిల్‌ హ్యాండ్‌ బుక్‌ 1807లో మొదలై 2005 లో డా||ఇమ్మానుయేల్‌ రెడ్డి ద్వారా నాకు చేరింది.  వి. ఇమ్మానుయేల్‌ రెడ్డి 5 లేక 6 ప్రశ్నలు ప్రతి రోజు నాకు అసంబద్ధాలు అన్న భాగమునుంచి తెలుగునకు మార్చి ఇచ్చినపుడు, తెలుగు నందు నేను సమాధానాలు వ్రాసి ఇచ్చాను.  ఈ విధముగా నేను బైబిలు హ్యాండ్‌ బుక్‌లోని పేజి నెం 1 నుంచి 44 వరకు ఇయ్యబడిన అసంబద్ధాలకు సమాధానాలు వ్రాయగలిగితిని. ఇది అమెరికా హేతువాదులకు నేను ఇస్తున్న మొదటి సమాధానాల పుస్తకము.

ఈ పుస్తకములోని విమర్శలకు విశ్వాసి మనకెందుకులే అని ఊరుకున్నను, దేవుడు ఊరుకోడు.  కాబట్టి ఎఫెసీ 6:11-17లో వలె ఇమ్మానుయేల్‌ రెడ్డి ద్వారా నన్ను దేవుడు ప్రేరేపించి, ఈ అసంబద్ధాలకు సమాధానాలు వ్రాయించెను.  డబ్ల్యూ. పీ. బాల్‌, జీ.డబ్ల్యూ. ప్రూట్‌, జాక్‌ బోర్డన్‌, డిచర్డ్‌ యమ్‌. స్మిత్‌ , మరియు మిగిలిన వారు ”వాసిన, ''ది బైబిల్‌ హ్యాండ్‌ బుక్‌ను'', వట్టిదిగా చేయుటకు దేవుడు తన వాక్యమనే ఖడ్గమును నాకు అందించెను.  బైబిలు హ్యాండ్‌ బుక్‌లోని తరువాతి భాగాలైన అసంభావ్యాలు, అత్యాచారాలు, అపశృతులు, అశ్లీలాలు వంటి భాగాలకు కూడా సమాధానాలు వ్రాయుట జరిగింది.  వీటిని త్వరలో ప్రచురించుటకు సిద్ధము చేయబడుచున్నవి.

దైవ విశ్వాసులు ఈపుస్తకమును చదివి హేతువాదునికి సరియైన సమాధానమును ఇవ్వవలసినదిగా నేను కోరుచున్నాను.  ఈ విధముగా భూమిమీద ఉన్న దైవ వ్యతిరేక హేతువాదమును రూపుమాపగలము. ఆమేన్‌!

©2019 GoogleSite Terms of ServicePrivacyDevelopersArtistsAbout Google|Location: United StatesLanguage: English (United States)
By purchasing this item, you are transacting with Google Payments and agreeing to the Google Payments Terms of Service and Privacy Notice.