మనకు దీనిని అర్థం చేసుకొనవలసిన అవసరత వుందా? అన్న సంశయము కలుగును. విలపించువారు ఎందుకు విలపిస్తున్నారు, దానికి గల కారణము ఏమైయుండునని పరిశీలిస్తే అలాంటి కారణమునకు మనము గురికాకుండా తప్పించుకొను అవకాశము వుంటుంది. ఈ పుస్తకములో బైబిలు గ్రంథములోని బాబిలోని దాస్యము అను కాడి క్రింద ఇశ్రాయేలీయులు చేసిన పాపము నిమిత్తము వారు పొందిన శ్రమ దానికి కారణమైన దేవుని ఉగ్రత, వారు అనుభవించిన వినాశనము దానివలన వారికి కలిగిన విలాపమును ఈ విలాపవాక్యములు అను గ్రంథముగా వ్రాయుట జరిగింది. దానిని బైబిలు గ్రంథములో ప్రాధాన్యతను ఇచ్చి రచించారు అంటే దేవుని ఉద్దేశ్యములో దీనిని గూర్చి అందరు తెలుసుకొనవలెననేకదా! ఇలా వుంచుటలో దేవుని ఉద్దేశ్యము ఆయన మనకు ఈ గ్రంథకర్త రచన ద్వారా మనకు ఏమి చెప్పాలనుకొన్నారో చదివి గ్రహించి తదనుగుణముగా జీవించువారు ధన్యులే.