సున్నతి - బాప్తిస్మము (Telugu)

Faith Scope
11

 ప్రియపాఠకులారా!  ఈ ప్రపంచ చరిత్రలో ఎన్నో మతాలు, సిద్ధాంతాలు ఏర్పరచబడ్డాయి.  అయితే వీటిలో నిజదైవము ఏర్పరచినవి ఎన్ని?  నిజదైవములోనికి వచ్చుట ఇష్టము లేని అపవాది అను సాతాను ఏర్పరచినవి ఎన్ని?  పాత నిబంధన కాలములో నిజదైవము అబ్రాహామునకు ప్రత్యక్షమై సున్నతిని ఒక గుర్తుగాను, ఒడంబడిక గాను ఏర్పరచుట జరిగినట్లుగా ఆదికాండములో మనము చదువగలము.  అలాగే పాత నిబంధన కాలములో నిజదైవము మోషేకు తన్నుతాను ప్రత్యక్షపరచుకొని సీనాయి కొండపై పది ఆజ్ఞలను వాటితోబాటు ఆచరించవలసిన నియమములు, కట్టడలు రాజ్యాంగ పరిపాలన న్యాయవిధులు వగైరాలన్నియు ధర్మశాస్త్రమను పేరుతో మోషే చేత వ్రాయించడం జరిగింది.  ఈ ధర్మశాస్త్ర గ్రంథములో సున్నతికి ప్రాధాన్యతను ఇస్తూనే హృదయ సంబంధమైన సున్నతిని ఏర్పరచుట జరిగింది.  యిర్మీయా 9:25 అంటే నీతిగా జీవించినవారే నిజ దైవ సంబంధులుగా గుర్తించబడుదురని చెప్పబడినది.

ఈ విధముగా కొంతకాలము సున్నతి క్రియ జరిగించింది.  నూతన నిబంధన కాలమునకు మూలపురుషులైన బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువునకు కూడా సున్నతి జరిగించారు.  అయితే నిజదైవమునకు ప్రతిరూపమైన యేసుక్రీస్తు ప్రభువునకు బాప్తిస్మము యోహాను ద్వారా ఇయ్యబడినది.  ఈ బాప్తిస్మమును నూతన నిబంధన కాలములో దైవప్రత్యక్షత ద్వారా యోహాను పొందుట జరిగింది.  దానిని అమలుపరచాడు.

దైవవాక్యమును పొందిన క్రీస్తు ప్రభువు చెప్పిన రీతిగా నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను బాప్తిస్మము పొందవలసియున్నది, ఎందుకంటే క్రీస్తుయేసునందు నమ్మకము కలిగి ఆయనయందు విశ్వాసముంచుట అను దానికి ఒక మెట్టుగా మనము గుర్తించాలి.  ''నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును.''  ఇది బైబిలు గ్రంథము చెప్పుచున్న నిజము.  సున్నతి పొందినను, పొందక పోయినను నమ్మి బాప్తిస్మము పొందుట ముఖ్యమైన విషయము.  బాప్తిస్మము పొందిన క్రీస్తు ప్రభువే తాను పొందబోవు బాప్తిస్మమున్నదని లూకా 12:50.  కనుక బాప్తిస్మము పొందిన ప్రతి యొక్క విశ్వాసి తాను పొందవలసిన బాప్తిస్మము ఏమిటో ఈ పుస్తకము ద్వారా గ్రహించాలి. 

ఈ బాప్తిస్మమును అనేక సంఘములవారు అనేక రీతులుగా పొందుచున్నారు.  ఈనాడు ఈ బాప్తిస్మమును ప్రపంచ నలుమూలలా ఉన్న క్రైస్తవులు ప్రమాణము ద్వారా చిలకరింపు ద్వారా నీటి ద్వారా ఆచరించుట జరుగుచున్నది.  అయితే బైబిలు గ్రంథము బాప్తిస్మము ఎలా పొందాలో ఖచ్చితమైన వాక్యముల ద్వారా తెలియజేస్తున్నది.  కనుక బాప్తిస్మమును పొందినవారు, పొందాలి అనుకొనేవారు ఈ పుస్తకమును చదివి బాప్తిస్మములోని మర్మములను గుర్తించి సరియైన పద్ధతిలో మరల బాప్తిస్మమును పొందుట మంచిదని నా అభిప్రాయము.  ఎందుకంటే బాప్తిస్మమును పొందినవారికి పౌలు తన చేతుల ద్వారా బాప్తిస్మమును మరలా ఇచ్చి వారికి పరిశుద్ధాత్మను కూడా ఒసగుట జరిగింది.

కనుక ఈ పుస్తకము ఆమూలాగ్రము క్షుణ్ణముగా చదివి గ్రహించి నమ్మకము కలిగి బాప్తిస్మమును నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను పొందుట మంచిదని ఈ పుస్తకము ద్వారా త్రియేక దేవుని నామములో ప్రతి ఒక్కరిని హెచ్చరించుచున్నాను.


Read more
Collapse
3.6
11 total
Loading...

Additional Information

Publisher
Faith Scope
Read more
Collapse
Published on
Jul 28, 2017
Read more
Collapse
Pages
84
Read more
Collapse
ISBN
9781944890193
Read more
Collapse
Read more
Collapse
Read more
Collapse
Language
Telugu
Read more
Collapse
Genres
Religion / Biblical Commentary / General
Religion / Prayerbooks / Jewish
Read more
Collapse
Content Protection
This content is DRM protected.
Read more
Collapse
Read Aloud
Available on Android devices
Read more
Collapse
Eligible for Family Library

Reading information

Smartphones and Tablets

Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.

Laptops and Computers

You can read books purchased on Google Play using your computer's web browser.

eReaders and other devices

To read on e-ink devices like the Sony eReader or Barnes & Noble Nook, you'll need to download a file and transfer it to your device. Please follow the detailed Help center instructions to transfer the files to supported eReaders.
 సుమారు 2000 సంవత్సరముల క్రితం ఈ లోకములో క్రీస్తు ప్రభువు జన్మించి తన 30 సంవత్సరాల వయస్సులో సువార్తను ప్రబోధించుట జరిగింది.  ఈ కార్యక్రమములో భాగముగా ఆయన సుమారు 33 1/2 సంవత్సరాల వయస్సులో ఈ లోక నరకోటికి పాపక్షమాపణను మారుమనస్సు ద్వారా కలిగించుటకు సిలువ బలియాగము చేసాడు.  ఈ సందర్భములో ఏడు మాటలు సిలువపై పలుకుట జరిగింది.  ఈ మాటలు ఈనాడు అన్ని సంఘములవారు శుభ శుక్రవారము అనగా గుడ్‌ ఫ్రైడే రోజు వివరించుట చేస్తారు.  అలాగే క్రీస్తు ప్రభువే స్వయముగా ఈ లోకములో సువార్తను కొనసాగించుచు అనేక వచనాలను బోధించుట జరిగింది.  ఆ వచనాల పరమార్థాలే ఈ పుస్తకమునకు పునాది.  ఇలాంటి వచనాల సంఖ్య 63 అంతేకాక సిలువపై మాటలు 7 తో కలిపి మొత్తము 70 అంశములుగా ఈ పుస్తకము నందు ప్రభువు కృపతో సిద్ధపరిచాము.  ఇలాంటి సమయములో పెంచల్‌ కుమార్‌ మరియు సురేంద్ర కుమార్‌ అను పేరుగల మిత్రులు ఇరువురు ఈ పుస్తకము త్వరగా అచ్చు కావాలి అందరికి అందుబాటులో ఉండాలి అని వారు అనేక మారులు ప్రేరేపింపగా ఈ పుస్తకమును ముందుగా విడుదలకు సిద్ధపరచుట జరిగింది.  వారికి మా కృతజ్ఞతలు.  ఇందులో వ్రాయబడిన ప్రతి అంశములోను దైవ నిగూఢ సత్యములనకేములున్నవి.  కనుక పాఠకులు ఇవన్ని మేము చదివినవే కదా అని విస్మరించక పూర్తిగా చదివి దైవ నిగూఢ సత్యములలోని దైవిక మర్మములు తెలుసుకొని ఆనందించాలని నా ఆకాంక్ష.
 నేను ఈ పుస్తకము వ్రాయుటకు తలంచినది వేరు నేను వ్రాసినది వేరు.  నేను నా జీవితములో పండుగలు - ఉత్సవాలు వంటివి అన్యుల కోసం చేస్తున్నారులే అనుకొని నిజక్రైస్తవులకు వీటితో ఏమి పని లేదని భావించేవాడిని.  కాని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించి, ఈ చిన్న పుస్తకమును వ్రాయించుట జరిగింది.  ఇందులో మన ఇహలోక జీవితములో శరీర సంబంధముగా ఇవి సాధనాలని, ఇవి కొంచెం మట్టుకు ప్రయోజనాలని తెలియజేయబడింది.  ఇలాంటి సాధనాలు నరులను దేవునివైపు కొంతమట్టుకు ప్రయోజనకరమై లాగగా, వారిని దైవసంబంధులమైన మనము ఆత్మలో ఎదుగునట్లుగా వారిని వాక్య పరిచర్యల యందు నిత్యము ప్రేరేపిస్తూ - వారిని అదే స్థితిలో ఉండనియ్యక దినదినము దేవునిలో అత్యున్నత స్థానమును పొందువారుగా చేయువారుగా మనము ఉండాలి.  ఇందులో కూడ స్వార్థమును వీడి నరులు దేవుని దరికి వచ్చుటకు, క్రైస్తవులమైన మనము ఎంతో ఆనందముగా ఈ పండుగలు - ఉత్సవాలు జరిగించవలసియున్నది.  ఈ స్థితి ప్రభువునకు యోగ్యమైనదియు ప్రియమైనదిగా ఉన్నది.  కనుక నేను ఈ చిన్న పుస్తకము ద్వారా పండుగలు - ఉత్సవాలు - మ్రొక్కుబడులు - విగ్రహాలు మొదలైనవన్ని వాటి గురించి క్షుణ్ణముగా పరిశుద్ధాత్మ కృపతో ప్రభువు ప్రేమ దయ కనికరము వలన వ్రాయగలిగాను.  కనుక ఈ పుస్తకము సంపూర్తిగా చదివి దేవునిలో మరింత జ్ఞానమును పొంది సిగ్గు విడిచి ప్రభువు కార్యములు కొనసాగించుదముగాక!  ప్రభువు కార్యములలో మన హస్తము కొంచెము మట్టుకు ఉన్న యెడల మనము ధన్యులమే!
 ప్రియ పాఠకులారా! మన జీవితములో విలపించు సందర్భాలు లేనివారంటూ వుండరు. ఏదో ఒక సందర్భములో భరింపరాని బాధ కలుగుట జరుగును. ఆ బాధ హృదయమును పిండగా, మన మనస్సు వికలమై పరిపరివిధాలుగా ఆలోచిస్తూ విలపించుట జరుగును. కొందరి జీవితాలలో విలపించుట కొన్ని సందర్భాలలో జరిగితే మరి కొందరి జీవితాలలో అనేక సందర్భాలలో విలపించుట జరుగును. మరికొందరి జీవితమే విలపించుటతోనే సరిపోతుంది. ఈ విలపించుటలో మన జీవితమే కోల్పోయిన బాధ వుంటుంది. ఈ బాధ వర్ణించుట అసాధ్యమే. కాని ఆయా సందర్భాలను ఊహించుట ద్వారా అర్థం చేసుకోవచ్చు.

మనకు దీనిని అర్థం చేసుకొనవలసిన అవసరత వుందా? అన్న సంశయము కలుగును. విలపించువారు ఎందుకు విలపిస్తున్నారు, దానికి గల కారణము ఏమైయుండునని పరిశీలిస్తే అలాంటి కారణమునకు మనము గురికాకుండా తప్పించుకొను అవకాశము వుంటుంది. ఈ పుస్తకములో బైబిలు గ్రంథములోని బాబిలోని దాస్యము అను కాడి క్రింద ఇశ్రాయేలీయులు చేసిన పాపము నిమిత్తము వారు పొందిన శ్రమ దానికి కారణమైన దేవుని ఉగ్రత, వారు అనుభవించిన వినాశనము దానివలన వారికి కలిగిన విలాపమును ఈ విలాపవాక్యములు అను గ్రంథముగా వ్రాయుట జరిగింది. దానిని బైబిలు గ్రంథములో ప్రాధాన్యతను ఇచ్చి రచించారు అంటే దేవుని ఉద్దేశ్యములో దీనిని గూర్చి అందరు తెలుసుకొనవలెననేకదా! ఇలా వుంచుటలో దేవుని ఉద్దేశ్యము ఆయన మనకు ఈ గ్రంథకర్త రచన ద్వారా మనకు ఏమి చెప్పాలనుకొన్నారో చదివి గ్రహించి తదనుగుణముగా జీవించువారు ధన్యులే.


ప్రియపాఠకులారా! దేవుడు ఈ లోకమును చేసి అందులో జీవాత్మను సృజించాడు.  ఈ లోకములో సృజించబడిన ఈ ఆత్మలో నుండి ఈనాడు అనేక ఆత్మలు ఒకదాని తరువాత ఒకటి వచ్చుటకు మార్గము ఏర్పడి అలా వచ్చినవారమే మనమందరము.  ఇందులో ఈనాడు క్రైస్తవులు, అన్యులు ఉన్నారు.  క్రైస్తవులను క్రీస్తు ప్రభువు యెరూషలేము కుమార్తెలుగా వర్ణించాడు. అన్యులను  బబులోను అను మహావేశ్యతో వర్ణించాడు. ఇక వీరిద్దరు కాక ఇంకొక రకము స్త్రీని వర్ణించుట జరిగింది. ఆ స్త్రీయే నల్లనిదియైన స్త్రీ. ఈ స్త్రీ పేరు షూలమ్మీతీ అని చెప్పబడింది. అంటే జీవాత్మగా ఈ లోకమునకు వచ్చిన తరువాత వారి క్రియలను బట్టి జీవాత్మ ముగ్గురు స్త్రీలుగా విభజింపబడినారు. వీరు నిజానికి వధువు సంఘముగా ఏకసంఘముగా ఉండ వలసినవారు.  క్రీస్తు ప్రభువు ప్రియునిగా ఈ ముగ్గురు స్త్రీల మధ్య జరిగే సంభాషణయే ఈ పరమగీతము.  క్రీస్తు ప్రభువు బబులోను అను స్త్రీ సంఘములో ఉన్న నశించువారిని వర్ణించుటయేగాక వారిలో మార్పును తీసుకొని వచ్చుటకు తాను పడే శ్రమను ఇందులో వర్ణించుట జరిగింది.  అలాగే బబులోను సంఘములో నుండి యెరూషలేము కుమార్తెగా నిజ క్రైస్తవ విశ్వాసములోనికి మారుచున్న విశ్వాసి యొక్క అన్వేషణ, వారిలో నిజమును తెలుసుకోవాలన్న తపన ఇందులో బహుసుందరముగా వర్ణిస్తూనే, పాతనిబంధనలోని యెరూషలేము దేవాలయము, నూతన నిబంధనలో మరియమ్మ యొక్క ఎన్నిక, యేసు తన ప్రేమను సిలువ రూపములో ప్రదర్శించుట, ఈ లోకములో క్రీస్తు ప్రభువు యొక్క బాధ్యతను శిరసావహించి ఆయన కాడిని మోయు సేవకులు వెయ్యి రూపాయలు సంపాదించగా ఈ లోకములో తాము పొందిన శ్రమగా క్రీస్తు ప్రభువు ముందు సమర్పించగా ఆయన వారి క్రియల చొప్పున ప్రకటన 2, 3 అధ్యాయములో వలె తీర్పు దినమున తిరిగి రెండువందల రూపాయలు అనగా అనేక బహుమతులను పొందుట, జీవాత్మలో పరిశుద్ధాత్మ క్రియలు, చివరిగా ఈ లోకములో క్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన ఆయన తల్లియైన కన్య మరియమ్మ క్రీస్తు ప్రభువును వరునిగా సిద్ధపరచి ఆయనకు కిరీటమును ధరింపజేయుట, అందుకు యెరూషలేములో వారసత్వము పొందిన విశ్వాసులను చూచుటకు పిలుచుట, మొదలైనటువంటి అద్భుతమైన సంఘటనలతో ఇందులో ఒకే ఒక గీతముగా రచించుట ఇది ఒక అద్భుతము.  దీనిని ఆమూలాగ్రము చదివి ఒక అనుభూతిని మరొకసారి పొందమని గ్రంథకర్తగా నేను ఆపేక్షిస్తున్నాను.  . . .
 ప్రియపాఠకులారా!  ఏడు అను సంఖ్యపైన వ్రాసిన ఈ పుస్తకమునకు మూలాధారము పవిత్ర గ్రంథము అని మరల చెప్పనవసరత లేదు.  మొట్టమొదట, దేవుడు ఈ సృష్టిని ఏడు దినములలో సృష్టించాడు.  ఈ విషయమును గూర్చి మనము బైబిలు గ్రంథమను వేదములో చదువగలము.  ఈ పుస్తకమునకు గ్రంథకర్తనైన నేను ఈ ఏడు రోజులను ఒక మూలముగా చేసుకొని పవిత్రాత్మ ప్రేరణతో ఈ పుస్తకమును వ్రాసాను.  ఈ పుస్తకము నందు నేను దేవునియొక్క ప్రణాళిక మరియు ఉద్దేశ్యమును ఏడు సంఖ్యగా మార్చుటకు చాలా శ్రమించవలసి వచ్చింది.  ఇందుకోసము అనేక దినములు పరిశోధించవలసి వచ్చింది.  నేను దేవుని ఆత్మ సహాయము తప్ప మరే గ్రంథకర్తల సహాయము తీసుకొనలేదు.

ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు దేవునియొక్క రహస్యములను బహిర్గతము చేయు సంఖ్య ఏడు.  ఈ పుస్తకమును వ్రాయుటకు ముందు సుమారుగా ఆరు నెలల కాలము పవిత్ర గ్రంథమును నేను పఠించి ప్రతి విభాగమును ఏడు సంఖ్యగా పూర్తి చేయుట జరిగింది.  ఈ పఠన కాలములో, నేను 2, 3, 4, 5, 6, 10, 12, 40 వ్రాసాను.  ఈ పుస్తకమును కూడ చదివి మీ యొక్క సలహాలను ఇవ్వండి.

క్రీస్తు ప్రభువు యొక్క కృప అందరికి తోడైయుండునుగాక!  ఆమేన్‌. 

©2019 GoogleSite Terms of ServicePrivacyDevelopersArtistsAbout Google|Location: United StatesLanguage: English (United States)
By purchasing this item, you are transacting with Google Payments and agreeing to the Google Payments Terms of Service and Privacy Notice.