ఏలీయా (Telugu): కాలాలకు అతీతుడును అత్యున్నతుడైన ఓ ప్రవక్త

Faith Scope
22

 ప్రియపాఠకులారా!  ఇది చాలా చాలా చిన్న పుస్తకము.  కాని దీనిలో ఉన్నది ఏలీయాలోని శక్తి ఏలీయాను గూర్చిన భవిష్యత్తు.  అన్ని కాలాల వారికి ఇంకా భవిష్యత్తుగానే ఉన్న వ్యక్తి ఏలీయా.  రాజుల కాలమునకు ముందు వారికి సుడిగాలిలో ఆరోహణమయ్యే వ్యక్తిగా భవిష్యత్తులో జరుగు సంఘటనగా ఉన్నాడు.  ఇది రాజుల కాలములో జరిగింది.  నూతన నిబంధనకు ముందు క్రీస్తు ప్రభువు మార్గమును సరాళము చేసి ఇశ్రాయేలీయ దేశము నాశనము కాకుండుటకు వచ్చిన శబ్దముగా భవిష్యత్తులో జరుగు సంఘటనగా ఉన్నాడు.  ఇది నూతన నిబంధన ప్రారంభ కాలములో జరిగింది.  ఇప్పుడు మనకు యుగాంతమునకు ముందు క్రీస్తు ప్రభువు రాకడకు ముందు ఆయన మార్గమును సరాళము చేయు వానిగా తనకు తోడుగా హనోకుతో కలిసి వచ్చుట జరుగును.  ఇది జరగవలసినది.  అంటే భవిష్యత్తు గూర్చిన ప్రవచనములు.  యుగాంతమునకు ముందు ప్రపంచ నాశనము జరగకుండా చేయుటకు వచ్చి నరుల హృదయమును దేవుని వైపు త్రిప్పుట చేస్తాడు.  ఇలా చేసినను వారి మరణానంతరము జనులు తిరిగి సాతాను విశ్వరూపమైన క్రూరమృగమునకు దాసోహులై యుగాంతమునకు కారకులు అగుచున్నారు.  ఇలా స్వభావమున ఒక మనుష్యుడైన ఏలీయా ఇంచుమించు అన్ని కాలాలలో తన ఆత్మ రూపములోను మరియు భౌతిక శరీరములతో ఇద్దరు సాక్షులుగాను నరుల మధ్య క్రియ జరిగించెను, జరిగించును, జరిగిస్తాడు  . . . . .

        ఇలాంటి ప్రవక్తను గూర్చి తెలుసుకొనుట మన జీవితములో ఒక గొప్ప అనుభూతి.  ఈ అనుభూతి మధురముగా ఉంచుకొనుటకు నీతి పరిశుద్ధతతో దేవునిలో జీవించాలి.  లేని యెడల చివరకు మిగిలేది బూడిద అన్నట్లుగా మన ఆత్మీయ జీవితము పాతాళ లోకము అగ్నిగుండములలో చేదు అనుభవమును పొందును.

        ఏది ఏమైనప్పటికి, ఎవరు ఎన్ని ఆలోచనలు చేసిన ప్రవక్తలలో ఏలీయా ఏలీయానే!

                                                           ఇట్లు

                                                        శేఖర్‌రెడ్డి
Read more
Collapse
4.6
22 total
Loading...

Additional Information

Publisher
Faith Scope
Read more
Collapse
Published on
Oct 2, 2016
Read more
Collapse
Pages
37
Read more
Collapse
ISBN
9781944890063
Read more
Collapse
Read more
Collapse
Read more
Collapse
Language
Telugu
Read more
Collapse
Genres
Bibles / The Message / General
Religion / Biblical Studies / Prophets
Religion / Biblical Studies / Wisdom Literature
Read more
Collapse
Content Protection
This content is DRM protected.
Read more
Collapse
Read Aloud
Available on Android devices
Read more
Collapse
Eligible for Family Library

Reading information

Smartphones and Tablets

Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.

Laptops and Computers

You can read books purchased on Google Play using your computer's web browser.

eReaders and other devices

To read on e-ink devices like the Sony eReader or Barnes & Noble Nook, you'll need to download a file and transfer it to your device. Please follow the detailed Help center instructions to transfer the files to supported eReaders.
1.  దానియేలు - నాలుగు జీవులు

సింహము

మొదటి జీవి - మనుష్యుని రూపము

రెండవ జీవి - ఎలుగుబంటి

మూడవ జీవి - చిరుతపులి

నాలుగవ జీవి - భయంకరమైన జంతువు


2. దానియేలు - రెండు జీవులు

3.  డెబ్బది వారములు విధింపబడిన దానిని గూర్చిన దర్శనము

తిరుగుబాటు మాన్పుట

పాపము నివారించుట

దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట

యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుట

దర్శనమును ప్రవచనమును ముద్రించుట

అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట

డెబ్బది వారములలో మొదటి ఏడు వారములు

డెబ్బది వారములలో అరువది రెండు వారములు

4. దేవుని ఆజ్ఞ తన సేవకుడైన దానియేలుకు తెలియజేయుటకు ముందు - తెలియజేసిన తరువాత ఆత్మల పోరాటము

5. మహా ఆపద, పునరుత్థానము మరియు తీర్పును గూర్చిన దర్శనము

పునరుత్థానము మరియు తీర్పు

బుద్ధిమంతులు

ముద్రణా యంత్రమును గూర్చిన ప్రవచనము దానియేలు ప్రవచనములు అంత్య కాలములో ముద్రింపబడు వరకు మరుగు చేయబడుట

6.  ప్రపంచమును తిరుగుట - నరులలో పెరుగు తెలివిని గూర్చిన ప్రవచనము

7.  ఏటి అవతలి యొడ్డున ఒకడు - ఇవతలి యొడ్డున ఒకడు నీళ్లపై ఆడుచుండగా దర్శనము

 నేను ఈ పుస్తకము వ్రాయుటకు తలంచినది వేరు నేను వ్రాసినది వేరు.  నేను నా జీవితములో పండుగలు - ఉత్సవాలు వంటివి అన్యుల కోసం చేస్తున్నారులే అనుకొని నిజక్రైస్తవులకు వీటితో ఏమి పని లేదని భావించేవాడిని.  కాని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించి, ఈ చిన్న పుస్తకమును వ్రాయించుట జరిగింది.  ఇందులో మన ఇహలోక జీవితములో శరీర సంబంధముగా ఇవి సాధనాలని, ఇవి కొంచెం మట్టుకు ప్రయోజనాలని తెలియజేయబడింది.  ఇలాంటి సాధనాలు నరులను దేవునివైపు కొంతమట్టుకు ప్రయోజనకరమై లాగగా, వారిని దైవసంబంధులమైన మనము ఆత్మలో ఎదుగునట్లుగా వారిని వాక్య పరిచర్యల యందు నిత్యము ప్రేరేపిస్తూ - వారిని అదే స్థితిలో ఉండనియ్యక దినదినము దేవునిలో అత్యున్నత స్థానమును పొందువారుగా చేయువారుగా మనము ఉండాలి.  ఇందులో కూడ స్వార్థమును వీడి నరులు దేవుని దరికి వచ్చుటకు, క్రైస్తవులమైన మనము ఎంతో ఆనందముగా ఈ పండుగలు - ఉత్సవాలు జరిగించవలసియున్నది.  ఈ స్థితి ప్రభువునకు యోగ్యమైనదియు ప్రియమైనదిగా ఉన్నది.  కనుక నేను ఈ చిన్న పుస్తకము ద్వారా పండుగలు - ఉత్సవాలు - మ్రొక్కుబడులు - విగ్రహాలు మొదలైనవన్ని వాటి గురించి క్షుణ్ణముగా పరిశుద్ధాత్మ కృపతో ప్రభువు ప్రేమ దయ కనికరము వలన వ్రాయగలిగాను.  కనుక ఈ పుస్తకము సంపూర్తిగా చదివి దేవునిలో మరింత జ్ఞానమును పొంది సిగ్గు విడిచి ప్రభువు కార్యములు కొనసాగించుదముగాక!  ప్రభువు కార్యములలో మన హస్తము కొంచెము మట్టుకు ఉన్న యెడల మనము ధన్యులమే!
 ప్రియపాఠకులారా!  పాతనిబంధన కాలములోని ప్రవక్తలు అనేక గ్రంథములు వ్రాయుట జరిగింది.  ఇందులో ప్రత్యేక గుర్తింపు గలిగిన గ్రంథము ప్రతి ఒక్కరు మరల మరల చదివే గ్రంథము యెషయా వ్రాసిన గ్రంథము.  ఈ గ్రంథము చాలా సులభ రీతిగా వ్రాయబడినను అక్కడక్కడ ప్రత్యేక మర్మములను పెంపొందింప చేసాడు.  ఉదాహరణకు బాలకులు బాల చేష్టలు చేసి జనులను ఏలడమేమిటో?  సర్పబీజము విషనాగు ఎగురు సర్పము ఇవియేగాక మకరము అను పేరుతో తీవ్రసర్పము వంకర సర్పము సముద్ర మార్గమందున్న సర్పము మరియు తూర్పున నుండి రప్పించు క్రూరపక్షి ఇవి ఏమిటో మానవ జ్ఞానమునకు వాని ఊహలకు అందనట్టి జ్ఞానము ఈ పుస్తకములో అనేకములున్నవి.  ఈ మర్మములను ప్రతి ఒక్కరు తెలుసుకొనుట మంచిది అన్న ఉద్ధేశ్యముతో ఈ పుస్తకమును వ్రాయుట జరిగినది.  కనుక యెషయా గ్రంథమును ఆమూలాగ్రముగ చదివి అర్థము చేసుకోవాలనుకొన్నవారికి ఈ పుస్తకము ఒక గొప్ప అవకాశము.  ఇందులో వివరించబడిన అంశములతోబాటు యెషయా గ్రంథమును వరుసగా చదువుచూ - ఆ భాగమునకు వచ్చుసరికి ఈ అంశములను జోడించి చదివిన మరింత ఎక్కువగా నేర్చుకొను అవకాశమున్నది.  అంటే మొదట బైబిలు గ్రంథమును తీసుకొని యెషయా గ్రంథములో వాక్యములను చదవాలి.  ఈ గ్రంథములో వ్రాసిన అంశము యొక్క రెఫరెన్స్‌ వచ్చుసరికి ఆ రెఫరెన్స్‌ చదివి, వెంటనే ఈ పుస్తకములోని అంశము చదివిన యెషయా వ్రాసిన ఉద్ధేశ్యములను బహు ఖచ్చితమైన రీతిలో మనకు సులభముగా అర్ధము అగునని గుర్తించాలి.

ఈ అంశములు వ్రాస్తూ నేను ఎంతగానో ఆనందించాను.  మీరు కూడా చదివి తమ జీవితాలను సరిజేసుకొని మీ పొరుగువారికి కూడా అందించి ఆనందించాలని ఈ పుస్తక రూపములో వెలువరించుట జరిగింది.

 ప్రియపాఠకులారా!  ఈ లోకరీత్యా ఒక రాజు ఉన్నాడని అనుకొందము.  అతనికి పరిచర్య చేయుటకు అన్ని విషయాలలో సేవకులు ఉంటారు.  అనగా యుద్ధ కాలాలలో తన పక్షముగా పోరాడే సైనికులు, ఖైదీలను తన ఆజ్ఞ ప్రకారము కాపలా కాయువారు, ఇలా మనము చెప్పుకుంటూపోతే రాజుకు రాజ్యములోని ప్రతి ఒక్కరు పరిచారకులే, ఎందుకంటే రాజు చెప్పినదే శాసనము.  ఉదా :- దానియేలు 3:1-6, ''రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమయొకటి చేయించి, బబులోనుదేశములోని దూరాయను  మైదానములో దాని నిలువబెట్టించెను.  అది అరువదిమూరల ఎత్తును ఆరుమూరల వెడల్పునై యుండెను.  రాజగు నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్రవిధాయకులను న్యాయాధి పతులను సంస్థానములలో ఆధిక్యము వహించినవారినందరిని సమకూర్చుటకును, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ యధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును మంత్రులును ఖజానాదారులును ధర్మశాస్త్రవిధాయకులును న్యాయాధిపతులును సంస్థానములలో ఆధిక్యము వహించినవారందరును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు కూడివచ్చి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయెదుట నిలుచుండిరి.  ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా-జనులారా, దేశస్థులారా, ఆ యా భాషలు మాటలాడువారలారా, మీకాజ్ఞ ఇచ్చుచున్నాను.  ఏమనగా, బాకా పిల్లంగ్రోవి పెద్దవీణె సుంఫోనీయ వీణె విపంచిక సకలవిధములగు వాద్యధ్వనులు మీకు వినబడునప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమయెదుట సాగిలపడి నమస్కరించుడి.  సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును.''  ఇందులో రాజు శాసించుట ఆయన రాజ్యములో ఉన్న ప్రతి ఒక్కరు పాటించుట చేసారు.  ఇలా ఆజ్ఞలను పాటించువారు పరిచారకులు అని చెప్పవచ్చును.

అలాగే ఈ సృష్టికి మూలము దేవుడు.  ఈయన రాజ్యము పరలోకము.  ఈ రాజ్యములో అద్వితీయ మహాదేవుడు తన సింహాసనముపై అధిష్టించి తన రాజ్యమైన ఏడు లోకాలను ఏలుచున్నాడు.  1 రాజులు 22:19, ''మీకాయా ఇట్లనెను-యెహోవా సెలవిచ్చినమాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్య మంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని.''  ఇటువంటి దేవాదిదేవుని పరిపాలనలో వివిధ రకాల దూతలు, జీవాత్మయైన నరులు, జంతువులు, పక్షులు, చెట్లు, జలచరములు మొదలైనవన్ని నివసిస్తున్నాయి.  ఇవే కాకుండ జీవాత్మ ఈ భౌతిక శరీరమును విడిచిన తరువాత ఆత్మలు నివసించే లోకాలు కూడ ఈ దేవుని ఆధీనములో ఉన్నవే.  అంటే మృతులు ఉండే మృతుల లోకము, ఈ భూలోకము, పౌలు దర్శనములో చూచిన మూడవ ఆకాశములోని లోకము, తీర్పు జరుగు మధ్యాకాశము అనగా మూడవ లోకము, అలాగే రహస్య స్థితిలో ఉన్న నాలుగు, ఐదు, ఆరు లోకాలు, అటుతరువాత ఉన్న అనంతమైన పరలోకము, వీటన్నిటికిని పైగా మహాకాశాలు అందులో 1 తిమోతి 6:16లో చెప్పబడినట్లు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగి నివసించును.  వీటన్నిటికి రాజాధిరాజు తండ్రియైన దేవుడు.  ఈయన రాజ్యములో ఉన్నవారందరు ఈయన యొక్క ఆజ్ఞల ప్రకారముగా జీవించవలసి యున్నది.

ఈనాడు మనము రకరకాల నరులు ఈ లోకములో జీవిస్తూ వివిధ రకాల వృత్తులు చేస్తూ ఉన్నారు.  వీరిలో వారి వారి ఆకారము వృత్తులు, జీవన విధానమును బట్టి వారు కొన్ని ప్రాంతములను ఎన్నుకొని జీవిస్తున్నారు.  వారి వారి ప్రాంతములను వారి సంబంధమైన రాజులు పరిపాలించుచున్నారు.  ఇలా ఈ లోకములో కొన్ని వందలమంది రాజులు ఏకకాలము పరిపాలించుచున్నారు.  వీరిలో సామంత రాజులు కూడ అనగా ఇంకో రాజు క్రింద పని చేయువారు ఉన్నారు.  ఈనాడు రాజుల స్థానములో పేరు మార్పు చెంది మంత్రులుగా చలామణీ అగుచున్నారు.  అలాగే పరలోక రాజ్యములో రాజు తండ్రియైన దేవుడు.  అయితే ఆయన దూతలు రకరకాల స్థితులలో అధికారులుగా ఉన్నారు.  ఈ దూతలలో వెట్టిచాకిరి చేయువారు ఉన్నారు, ఖైదీలు ఉన్నారు, తిరుగుబాటు దారులు ఉన్నారు.  అయితే వీరి జీవిత విధానము నరులపై ఎక్కువ ప్రభావము చూపునని మనము గ్రహించాలి.  నరుల ఉన్నత స్థితి, పతనమునకు రెండింటికిని కారకులు వీరు.  మనకు తెలియకుండానే మన చుట్టూ అనేక విధములైన కార్యములు జరిగిస్తూ మనకన్నా ముందుగా ఆ కార్యములు నెరవేర్పు జరిగిస్తున్నారు.  ఏడు లోకాలకు అధిపతియైన పరలోక రాజ్యాధిపతి తండ్రియైన దేవుడు యెహోవా అను నామధారి పరిపాలనలో అనేక రకములైనవారు నివసిస్తుండగా ఈ పుస్తకము ద్వారా మనము దేవుని దూతలను వారు చేయు కార్యములను గూర్చి సంపూర్ణముగా తెలుసుకొందము.

 ప్రియపాఠకులారా!  దేవుడు ఆదామును సృజించి వానిని ఏదెను వనమునకు కాపలాగా ఉంచి, వాని ప్రక్కటెముక నుండి స్త్రీని సృజించాడు.  మానవ పతనమునకు సంబంధించిన వృక్షఫలము ఒకటి ఆ వనములో ఉన్నదని ఆదామునకు తెలియకపోయినను, ఆ వృక్షఫలము తినుట ద్వారా మానవుని పతనము ఖచ్చితముగా జరుగునని దేవుడే స్వయముగా ఆదాముకు తెలియజేశాడు.  కాని ఆదాము హవ్వలు ఇద్దరును సర్పముయొక్క బోధలకు లోనై దేవుడు తినవద్దన్న పండును తిని మరణము మరియు దేవుని శాపములు పొందారు.

          అటుతరువాత నోవహు కాలములో దేవుడు నోవహు అతని కుటుంబాన్ని ఎన్నుకొని నూట ఇరువది సంవత్సరములు ఒక ఓడను నిర్మించేశాడు.  ఈ కాలములో దేవుడు నోవహు ద్వారా జలప్రళయము వలన జరుగు లోకనాశనాన్నిగూర్చి తెలియజేశాడు.  కాని భూజనులు మారలేదు.  దానికి ఫలితము మహాజలప్రళయము.  అటుతరువాత మోషే కాలములో దేవుడు ఇశ్రాయేలీయులను దాస్యము నుండి విడిపింపదలచి వారికి నాయకుడిని ఎన్నుకొన్నాడు.  మోషే ద్వారా ఐగుప్తులో జరుగు వినాశనమునుగూర్చి ఫరో రాజునకు అతని సంస్థానమునకు తెలియజేశాడు.  కాని ఫలితము మాత్రము నాశనమే.  అయినా దేవుడు వారికి ముందుగానే వారియొక్క నాశనమును తెలియజేసారు.

          ఇలా దేవుడు ముందుగానే వారి వారి నాశనమును గూర్చి ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ వచ్చారు.  ఎందుకంటే, వారు మారుమనస్సు పొంది రక్షణలోకి వస్తారని దేవునియొక్క ఆశ.  ఈ విధముగా మారుమనస్సు పొంది తమ తప్పులను వీడినవారు నీనెవె పట్టణస్థులు.  వారు యోనా యొక్క బోధ ద్వారా తమ తప్పును తెలుసుకొని మారుమనస్సు పొంది దేవుని రక్షణను పొందిరి.

          ఈ విధముగా దేవుడు జరిగించు వినాశనమునుగూర్చి ముందుగానే తానెన్నుకొన్న వారి ద్వారా తెలియజేసి, వారు మారుమనస్సు పాపపశ్చాత్తాపము పొందనట్లయితే వారిని నాశనము చేస్తూ వచ్చారు.

          కాని అంత్యకాలములో అనగా క్రీస్తు రెండవ రాకడలో జరగబోవు విషయాలను క్రీస్తు ప్రభువు మరణపునరుత్థానము తరువాత యోహానునకు దర్శనమిచ్చి వాని ద్వారా సమస్త లోకానికి జరుగబోవు సంగతులను తెలియజేసారు. ఇది జరిగి రెండువేల సంవత్సరాలై ఉండవచ్చును.  ఆ కాలమునుండి యుగాంతములో జరుగబోవు విషయములు తెలుసుకొని మారుమనస్సు పొందినవారు రక్షింపబడుచు వచ్చారు.  అయితే పొందనివారికి శిక్ష ఇంకా రాలేదు.  అయితే ప్రకటన గ్రంథము మర్మములతో కూడినది.  ఇది సాధారణమైనవారికి అర్థము కాదు అన్నది చాలామంది అభిప్రాయము.

          అయితే ఈ అంత్య దినములో అనగా లోకనాశనము దగ్గర పడుచున్న దినములో అందరికి అర్థమగు రీతిలో లోకాంత్యము జరుగుటకు కారణములు, ఎలా జరుగుతుంది?  అన్న విషయములనుగూర్చి ఈ పుస్తకము ద్వారా అందరికి తెలియజేయుటకు మమ్ములను ఎన్నుకొని మా ద్వారా ఈ పుస్తక కార్యక్రమము జరిగించి, దీనిని  ప్రతి ఒక్కరు చదువుకొని మారుమనస్సు పొందమని దేవుని హెచ్చరికయైయున్నది.  లేనియెడల నాశనము తప్పదని దేవుని హెచ్చరిక.  తన రాకడ యొక్క మర్మములు ప్రతి ఒక్కరు తెలుసుకొనవలెనని దేవుని కోరిక, ఎందుకంటే దేవుడు రహస్యముగా జరిగించువాడు కాదు.  తన ప్రవక్తల చేత ముందుగానే తెలియజేసి, కొంత సమయము ఇచ్చి, అప్పటికి మారుమనస్సు పొందనివారిని నాశనము చేయును.  అందులో భాగముగా మమ్ములను ఎన్నుకొని మాకు దైవజ్ఞానమును దయజేసి లోకనాశనము జరుగు విధానమును, దాని ఫలితమును ప్రతి ఒక్కరు సులభముగా అర్థము చేసుకొనునట్లు వ్రాయుటకు ప్రేరేపించి, ఈ పుస్తకము ద్వారా సమస్త భూజనులకు ఒక హెచ్చరికను దయజేయుచున్నాడు.

          ప్రియపాఠకులారా!  ఈ హెచ్చరిక సాధారణమైనది కాదు.  ఇది దేవునియొక్క నిర్ణయము.  ఇప్పుడు ఇంకా కొంత సమయము ఈ పుస్తకము ద్వారా భూజనులకు ఇచ్చియున్నారు.  ఈ పుస్తకమును చదివి మారుమనస్సు పొందమని కొంత సమయమును గూర్చి కూడ ఈ పుస్తకములో తెలియజేసియున్నారు.  కనుక మారుమనస్సు పొంది దేవునికి యోగ్యమైన రీతిలో జీవించమని తండ్రి - కుమార - పరిశుద్ధాత్మల యొక్క దూతగా మిమ్ములను ఆదేశించుచున్నాను.  లేనియెడల నాశనము తప్పదు, తప్పదు, తప్పదు.

          ప్రభువు యొక్క కృప ఆయన దాసులకు తోడైయుండును గాక!   ఆమేన్‌.

©2019 GoogleSite Terms of ServicePrivacyDevelopersArtistsAbout Google|Location: United StatesLanguage: English (United States)
By purchasing this item, you are transacting with Google Payments and agreeing to the Google Payments Terms of Service and Privacy Notice.