శ్రీ సత్యనారాయణశర్మ గారు వేదాంత - యోగ - తంత్ర - జ్యోతిషశాస్త్రములలోను, వీరవిద్యలు మరియు ప్రత్యామ్నాయవైద్య విధానములలోను లబ్దప్రతిష్ఠులు. ఇప్పటివరకూ వీరిచే రచింపబడిన 74 గ్రంథములు ఆధ్యాత్మిక జ్ఞాననిధులుగా చదువరులచేత కొనియాడబడుచున్నవి. వీరిచే స్థాపించబడిన ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ వేలాదిమందిని వెలుగుదారులలో నడిపిస్తున్నది. వీరు ప్రస్తుత్తం ఒంగోలు దగ్గరలోని ‘పంచవటి యోగాశ్రమం’లో నివసిస్తూ, ఆధ్యాత్మిక సాధకులకు మార్గదర్శనం చేస్తున్నారు.