శ్రీ శిరిడీ సాయి సత్సంగ మందిరము (మార్కాపురం) వ్యవస్థాపకులు శ్రీ ఆర్. రామచంద్ర రావు (RRR) సార్ గారిచే కూర్చ బడినటువంటి శ్రీ సాయి సూక్తిమాల అనే పుస్తకము ఆధారముగా ఈ మొబైల్ అప్లికేషన్ నిర్మించబడినది. శ్రీ సాయి సచ్ఛరిత్ర మరియు శ్రీ సాయి పై రచింపబడిన ఇతర పవిత్ర గ్రంధములలో గల శ్రీ సాయి బోధల యొక్క సారాంశము ఈ App కలిగియున్నది. ఈ బోధలతో పాటు, శ్రీ సాయి, శ్రీ లక్ష్మిదేవి మరియు శ్రీ దత్తాత్రేయ అష్టోత్తరములు మరియు శ్రీ విష్ణు సహస్రనామము, శిరిడీలో జరుగురీతిలో జరుపబడు శ్రీ సాయి ఆరతులు యిందు కలవు. శ్రీ సాయికి మిక్కిలి ఇష్టమైనవి మరియు శ్రీ సాయి భక్తులను ముఖ్యముగా వదిలివేయమనిన విషయములు కూడా యిందు కలవు.