అగ్రిసెంట్రల్ అనేది భారత రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టెక్నాలజీ ఆధారిత యాప్. తమ వ్యవసాయంలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు పెంచుకునేందుకు ఇది సహాయపడుతుంది. ఈ యాప్ జీపీఎస్, ఉపగ్రహ ఛాయాచిత్రాలు, బిగ్ డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఇమేజ్ అనలిటిక్స్ వంటి అధునాతన టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తూ రైతులను డిజిటల్ శకంలోకి నడిపిస్తుంది.
పూర్తిగా ఉచితం, కొత్తది మరియు మెరుగుపరచిన ఈ యాప్ లో ఉన్న ప్రధాన ఫీచర్లు:
• ఫార్మ్ వాయిస్: ఇక్కడ మీరు దేశవ్యాప్తంగా పురోగమిస్తున్న అభ్యుదయ రైతులతో అనుసంధానమై సంభాషించవచ్చు, మీ సందేహాలకు వ్యవసాయ నిపుణుల నుంచి పరిష్కారాలు పొందవచ్చు. మీ పంట గురించి ప్రశ్నలు అడగవచ్చు, వ్యవసాయంలో కొత్త పద్ధతుల గురించి తెలుసుకోవచ్చు, మీ విజయగాధలు ఇతర రైతులతో పంచుకోవచ్చు లేదా వ్యవసాయ సంబంధిత అంశాలపై చర్చించవచ్చు.
• క్రాప్ కేర్: అగ్రిసెంట్రల్ లో ఉన్న శక్తివంతమైన ఫీచర్లలో ఇది ఒకటి. ఫోటో గుర్తింపు, లక్షణాల నిర్ధారణ ద్వారా మీ పంటకు సోకిన చీడ, తెగులు, వ్యాధులు గుర్తించడానికి దోహదపడుతుంది. కొన్ని తేలికైన దశలలోనే మీ పంటను కాపాడుకోవడానికి నిపుణుల పరిష్కారం సూచించి, దానిని నయం చేయడానికి అత్యంత ప్రభావవంతమైన పురుగు మందులను తగిన మోతాదుతో సహా సూచిస్తుంది.
• క్రాప్ ప్లాన్: మీరు విత్తిన/నాటిన తేదీ, సాగు పధ్ధతి నమోదు చేస్తే, క్రాప్ ప్లాన్ మీకు ఆ పంటకు రోజువారీ చేయాల్సిన పొలం పనులను క్రమబద్ధంగా తెలియజేస్తుంది. ఇది తక్కువ ఖర్చుతో మెరుగైన దిగుబడి సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా పేరొందిన బ్రాండ్ల ఎరువులు, పురుగు మందులు, బయో ఏజెంట్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఎప్పుడు ఎలా వాడాలో మీకు తెలుస్తుంది.
• మార్కెట్ వ్యూ: 25,000 కు పైగా మార్కెట్ ధరలతో అగ్రిసెంట్రల్, మీ పంటలకు రోజువారీ ధరలు అందించే అతి పెద్ద వనరుగా మారింది. మార్కెట్ ధరలను మేము ప్రామాణిక వనరుల నుంచి, స్థానిక మార్కెట్ల నుంచి నేరుగా సేకరిస్తాము. జీపీఎస్ ఆధారంగా మీకు దగ్గరలోని మార్కెట్లలో ధరలు ముందుగా చూపి, దూరంగా ఉన్న మార్కెట్లలో ధరలు తరువాత చూపుతుంది. మీ పంటలకు ధరల సరళి గమనిస్తూ, ఎప్పుడు-ఎక్కడ మీ పంటను అమ్ముకోవాలో నిర్ణయించుకోవచ్చు.
• వాతావరణం: వాతావరణ విభాగం మీకు 15 రోజుల ముందస్తు వాతావరణ సూచనలు అందిస్తుంది. దీంతో మీ వ్యవసాయ పనులు ప్లాన్ చేసుకుని మీ పంటను నష్టాల నుంచి కాపాడుకోవచ్చు.
• ప్రొఫైల్: మీ పొలం ఎంత విస్తీర్ణం ఉందో లెక్కింపు చేయవచ్చు, మీ పొలం హద్దులు మ్యాప్ పై గుర్తించవచ్చు.
• బులెటిన్: అగ్రిబిజినెస్‌లో స్థానిక, జాతీయ మరియు ప్రపంచ పరిణామాలతో నవీకరించండి. పథకాల విభాగం మీరు ప్రయోజనం పొందగల పథకాల గురించి మీకు చెబుతుంది మరియు దానిని ఎలా పొందాలో మీకు సలహా ఇస్తుంది. ఈ సమాచారం వివిధ ప్రామాణికమైన వనరుల నుండి సంకలనం చేయబడింది మరియు ప్రతి పథకం కథనాలలో మూలాలు ప్రస్తావించబడ్డాయి.
రండి, అత్యంత వేగంగా పెరుగుతున్న స్మార్ట్ రైతుల సమూహం-అగ్రిసెంట్రల్ లో చేరండి.
ప్రభుత్వంతో అనుసంధానికి సంబంధించి నిరాకారణ/డిస్క్లైమర్:
యాప్‌లో కనిపించే సమాచారం ప్రామాణిక, అందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వ వనరులు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (https://pib.gov.in) మరియు వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ (https://agriwelfare.gov.in/) వంటి అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లు ఇచ్చే సమాచారం ఆధారంగా పొందబడిందని గ్రహించాలి. ఏదేమైనప్పటికీ, అగ్రిసెంట్రల్ యాప్ ఏ విధమైన కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం(లు) లేదా వాటి శాఖలు లేదా ఏజెన్సీలతో అనుసంధానమై లేదు. మరో మాటలో చెప్పాలంటే, అగ్రిసెంట్రల్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ సమాచారాన్ని స్వీకరించి, దానిని పొందిన రీతిగానే యూజర్లకు తెలియజేస్తుంది, మరియు దానిని సలహాల రూపంలో తెలియజేస్తుంది, కానీ ఏ ప్రభుత్వ సంస్థతోనూ అనుబంధించబడదు. మేము కేంద్ర ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా శాఖలు లేదా దాని అనుబంధ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నామని క్లెయిమ్ చేయము మరియు ఈ విషయంలో ఎక్కడైనా తప్పుగా సూచించడం వల్ల తలెత్తే ఏదైనా బాధ్యతను నిరాకరిస్తాము.
అగ్రిసెంట్రల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం, యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం ద్వారా మీరు ఈ ఒప్పందానికి, యాప్ లో పొందుపరిచిన వాడుక నిబంధనలకు కట్టుబడి ఉన్నారని అంగీకరిస్తున్నారు. ఈ యాప్ లోని విషయాలు పరిమితి లేకుండా, పూర్తి డేటా, సమాచారం, అక్షరాలు, పదాలు, గ్రాఫిక్స్, మరియు ఇతర మెటీరియల్ - మా యాప్ యూజర్స్ సౌలభ్యం కోసం అందించబడ్డాయి, అవి కేవలం సమాచార ప్రయోజనాల కోసమే వాడుకునేందుకు ఉద్దేశించినవి.
అప్‌డేట్ అయినది
12 సెప్టెం, 2024