అర్థ్

1982 • 138 నిమిషాలు
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

అర్థ్, 1982లో విడుదలైన హిందీ సినిమా. మహేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షబానా అజ్మీ, కుల్ భూషణ్ ఖర్బందా, స్మితా పాటిల్, రాజ్ కిరణ్, రోహిణీ హట్టంగడి తదితరులు నటించారు. గజల్ ద్వయం, జగ్జీత్ సింగ్ - చిత్ర సింగ్ సంగీతాన్ని సమకూర్చారు.
పర్వీన్ బాబితో తన సంబంధం గురించి మహేష్ భట్ రాసిన సెమీ ఆటోబయోగ్రాఫికల్ సినిమా ఇది. ఇండియా టైమ్స్ మూవీస్ సంకలనం చేసిన 25 తప్పక చూడాల్సిన బాలీవుడ్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను బాలు మహేంద్ర 1993లో మరుపాదియుమ్ పేరుతో తమిళంలో రీమేక్ చేశాడు. 2017లో పాకిస్తానీ నటుడు, దర్శకుడు షాన్ షాహిద్ అర్థ్ 2 సినిమాను విడుదల చేసాడు.