గంగూబాయి కతియావాడి

2022
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

గంగూబాయి కతియావాడి రచయిత, జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ నవలను ఆధారంగా చేసుకుని నిర్మించిన హిందీ సినిమా. భన్సాలీ ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్‌లపై సంజయ్ లీలా భన్సాలీ, డా. జ‌యంతిలాల్‌ గ‌డ నిర్మించిన ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించాడు. ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్, ఇమ్రాన్ హష్మి ప్రధాన నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరి 25న విడుదలయింది.
69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, గంగూబాయి కతియావాడి ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లేతో సహా 5 అవార్డులను గెలుచుకుంది. 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో, ఈ చిత్రం ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ నూతన నటుడు తో సహా ప్రముఖ 15 నామినేషన్లను అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి సహా ప్రముఖ 10 అవార్డులను గెలుచుకుంది.