మలాంగ్ 2020లో హిందీలో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. లవ్ ఫిలిమ్స్, టీ-సిరీస్, నార్తర్న్ లైట్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్, జయ్ శేవక్రమాని నిర్మించిన ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకతవం వహించాడు. ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటాని, అనిల్ కపూర్, కునాల్ ఖేము ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ను జనవరి 6న విడుదల చేసి సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేశారు.