సీతా రామం

2022
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

సీతా రామం 2022లో తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానున్న సినిమా. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై అశ్వినీదత్, స్వప్నాదత్ నిర్మించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, రష్మికా మందన్న, మృణాళిని ఠాకూర్‌, సుమంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి పాట ‘ఓ సీత హే రామ’ ‪ని మే 9న విడుదల చేసి ఆగష్టు 5న విడుదల చేశారు.ఈ చిత్రం టాలీవుడ్‌లో మృణాళిని ఠాకూర్‌కు తొలి చిత్రం. 1964 నాటి నేపథ్యంలో, లెఫ్టినెంట్ రామ్, కాశ్మీర్ సరిహద్దులో పనిచేస్తున్న అనాథ ఆర్మీ అధికారి, సీతా మహాలక్ష్మి నుండి అనామక ప్రేమ లేఖలను పొందాడు, ఆ తర్వాత రాముడు సీతను కనుగొని తన ప్రేమను ప్రతిపాదించే పనిలో ఉన్నాడు.