సీతా రామం 2022లో తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానున్న సినిమా. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై అశ్వినీదత్, స్వప్నాదత్ నిర్మించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, రష్మికా మందన్న, మృణాళిని ఠాకూర్, సుమంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి పాట ‘ఓ సీత హే రామ’ ని మే 9న విడుదల చేసి ఆగష్టు 5న విడుదల చేశారు.ఈ చిత్రం టాలీవుడ్లో మృణాళిని ఠాకూర్‌కు తొలి చిత్రం. 1964 నాటి నేపథ్యంలో, లెఫ్టినెంట్ రామ్, కాశ్మీర్ సరిహద్దులో పనిచేస్తున్న అనాథ ఆర్మీ అధికారి, సీతా మహాలక్ష్మి నుండి అనామక ప్రేమ లేఖలను పొందాడు, ఆ తర్వాత రాముడు సీతను కనుగొని తన ప్రేమను ప్రతిపాదించే పనిలో ఉన్నాడు.