చారులత

1964 • 117 నిమిషాలు
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

చారులత, 1964 ఏప్రిల్ 17న విడుదలైన బెంగాలీ సినిమా. 1901లో రవీంద్రనాధ టాగూరు రాసిన నస్తానిర్హ్ నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు సత్యజిత్ రే దర్శకత్వం వహించాడు. ఇందులో సౌమిత్రా ఛటర్జీ, మాధబి ముఖర్జీ, సైలెన్ ముఖర్జీ తదితరులు నటించారు. సత్యజిత్ రే తీసిన విజయవంతమైన సినిమాలలో ఇదీ ఒకటి.
ఈ సినిమాలోని మొదటి, చివరి సన్నివేశాలు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. మొదటి సన్నివేశం, దాదాపు సంభాషణలు లేకుండా చారులత ఒంటరితనం, ఆమె బయటి ప్రపంచాన్ని బైనాక్యులర్ల ద్వారా ఎలా చూస్తుందో చూపిస్తుంది. చివరి సన్నివేశంలో చారులత, ఆమె భర్త దగ్గరికి వచ్చి చేతులు పట్టుకోబోతున్నప్పుడు సినిమా ఫ్రీజ్ అవుతుంది. సినిమాను అందంగా చూపించడానికి ఫ్రీజ్ ఫ్రేమ్ చాలా ఉపయోగం అని ఇది వర్ణించబడింది.