రాంబో

1985 • 93 నిమిషాలు
R
రేటింగ్
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

1982లో సిల్వెస్టర్ స్టాలోన్ చిత్రం "ఫస్ట్ బ్లడ్" విడుదలయ్యింది. జాన్ రాంబో గతంలో వియత్నాం యుద్ధంలో పాల్గొన్న సైనికుడు. అది పూర్తయిన తరువాత అతనికి సరైన గుర్తింపు లభించలేదు. స్నేహితుడు గురించి విచారించగా చనిపోయాడని విధవ ఐన అతని భార్య ద్వారా తెలుసుకుంటాడు. చిత్రం ప్రారంభంలో రాంబో చిన్న పట్నం పొలిమేరల్లో బ్రిడ్జ్ పై నడచి వస్తుంటాడు. అతన్ని చూసిన పట్టణ షరీఫ్ వివరాలడుగుతాడు. అతడు చెప్పిన ప్రదేశానికి తను తీసుకువెలతానని చెప్పి తన పోలీసు కారులో పొలిమేరలో దింపుతాడు నిజానికి రాంబో సిటీకి వెళ్లాలనుకుంటాడు అందువలన పోలీసు అధికారి దించిన ప్రదేశం నుండి తిరిగి వెనక్కి రావడం అధికారి గుర్తిస్తాడు అందువలన అతడు మరల వెనక్కి వచ్చి అతన్ని సోదా చేసి కత్తిని కనుగొంటాడు. అది ఎందుకు అని అడిగితే రాంబో వేట కోసం అని చెబుతాడు. షరీఫ్ అతనిని పోలీసు స్టేషనుకు తీసుకెళతాడు. అక్కడ పోలీసులు అతనితో అమానుషంగా వ్యవహరిస్తారు. రేజరుతో అతన్ని సమీపిస్తున్న పోలీసుని చూసి గతంలో వియత్నాం యుద్ధంలో సంఘటనల్ని గుర్తుచేసుకుని తిరగబడతాడు. అతడు పోలీసు స్టేషను నుండి తప్పించుకుని బైకుపై పారిపోయే క్రమంలో పోలీసు అధికారి చేదనలో సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. తరువాత అతడు అడవిలోకి పారిపోయి గుహలో తలదాచుకుంటాడు. అతడిపై కోపోద్రిక్తుడైన పోలీసు అధికారి ఎలాగైనా పట్టి తీరాలనుకుని పోలీసు బలగాలను ఉపయోగిస్తాడు.
రేటింగ్
R