ది ఎలిఫెంట్ విష్పరర్స్

2022 • 39 నిమిషాలు
PG
రేటింగ్
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ అనేది అనాథ ఏనుగులను సంరక్షించే ఓ దంపతుల వాస్తవ జీవన ఆధారంగా 2022లో రూపొందించిన భారతీయ లఘుచిత్రం. తమిళ భాషలో తెరకెక్కిన ఈ చిత్రానికి తన మొదటి ప్రయత్నంగా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించింది. సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం 2022 నవంబరు 9న అమెరికాలోని డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ అయిన డాక్ ఎన్‌వైసి లో ప్రదర్శించబడింది. కాగా ఈ చిత్రాన్ని 2022 డిసెంబరు 8న నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ చేసింది.
ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్రం 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌ కేటగిరిలో అవార్డును గెలుచుకుంది, ఆ విభాగంలో అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకోవడం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఎంతో గర్వకారణం.
ఈ లఘుచిత్ర కథకు మూలకారకులైన బొమ్మన్‌, బెల్లి దంపతులను తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా మావటీలకు వారి స్వస్థలాల్లోనే పక్కా ఇళ్ళను నిర్మించనున్నట్లు ప్రకటించడంతో పాటు కోయంబత్తూరు జిల్లా సాడివయల్‌ ప్రాంతంలో రూ.8 కోట్ల వ్యయంతో ఏనుగుల సంరక్షణా కేంద్రం ఏర్పాటుచేస్తున్నట్టు పేర్కొంది.
రేటింగ్
PG