ది ఘోస్ట్ యాక్షన్ స్పైథ్రిల్లర్ తెలుగు సినిమా. శ్రీవెంకటేశ్వర ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్‌మరార్ నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. నాగార్జున, కాజల్ అగర్వాల్, గుల్‌పనాగ్, అనిఖా సురేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన, ఈ సినిమా 2022 అక్టోబర్ 5న థియేటర్లో విడుదలకాగా, 2022 నవంబర్ 3న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.