మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తెలుగులో విడుదలైన రొమాంటిక్ కామెడీ ప్రేమ కథ సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మించిన ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించాడు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఆమని, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలై, నవంబర్ 19న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.