ఒప్పం

2016 • 157 నిమిషాలు
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

ఒప్పం గోవింద్ విజయన్ కథ ఆధారంగా, 2016లో ప్రియదర్శన్ రచనా, దర్శకత్వం వహించిన మలయాళీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఆశీర్వాద్ సినిమాస్ తరుఫున ఆంటోని పెరుంబవూర్ దీన్ని నిర్మించారు.మోహన్ లాల్, అనుశ్రీ, సముద్రఖని, విమలా రామన్, నేదుముడి వేణు, బేబీ మీనాక్షీలు ముఖ్య నటీనటులు. ఈ చిత్రానికి పాటలు 4 మ్యూజిక్స్ బృందము సమకూర్చగా, స్వరాలను రాన్ ఏతాన్ యోహాన్ సమకూర్చారు. ఎన్‌కె ఏకాంబరం ఛాయాగ్రాహకునిగా వ్యవహరించారు.
ఒక అంకణాలింటికి లిఫ్ట్ ఆపరేటరూ, కేర్‌టేకరుగా ఉన్న జయరామన్ అనే అంధుడు ముఖ్య పాత్రధారి. ఇతను వృత్తిరీత్యా న్యాయమూర్తి యైన కృష్ణంరాజుకు నమ్మిన బంటు. బళ్ళో చదువుకుంటున్న ఆయన కూతురు నందినీ ఆలనాపాలనా జయరామనే చూసుకుంటుంటాడు. ఇంతలో గతములో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా కృష్ణమూర్తి, వరుస హత్యలు చేస్తున్న ఒక హంతకుడిచే హత్య చేయబడతాడు. ఈ నేరము జయరామన్‌పై పడుతుంది. తాను నిర్దోషినని నిరూపించుకోవడముతో పాటు నందినీని ఆ హంతకుడి బారి నుండి కాపాడాల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. ఇది కథ యొక్క ఇతివృత్తము.