ఈ టీవీ షో గురించి

సుడల్‌: ది వొర్టెక్స్‌ 2022లో విడుదలైన తెలుగు వెబ్‌సిరీస్‌. వాల్ వాచర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై గాయత్రి పుష్కర్‌ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌లో ఐశ్వర్య రాజేశ్, గోపిక రమేష్, కథిర్, ఆర్. పార్థిబన్, శ్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించగా బ్రహ్మ జి, అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించారు. సుడల్‌ వెబ్‌ సిరీస్‌ 30 భాషలలో జూన్ 17న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది. వెబ్ సిరీస్ మొదటి సీజన్ ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటుంది. వెబ్-సిరీస్‌కు సామ్ సిఎస్ సంగీతం, ముఖేశ్వరన్ సినిమాటోగ్రఫీ, రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ అందించారు.