కృష్ణుడికి శ్రుతి శుద్ధమైన వేణువుని కానుక ఇవ్వాలని అనుకున్నాడు గోపన్న. శ్రుతులన్నీ దాచుకున్న బొజ్జలోంచి, ఓంకారానికి మూల స్థానమైన నాభిలోంచి, వెన్నా పాలూ ఆరగించిన మధురాధరాల లోంచి జీవం వచ్చి తన వేణువులో ప్రవేశించి, పనికి రాదనుకున్న వేణువును కూడా పవిత్రం చేస్తుందన్న ఎరుక కలిగి, తరించాడు.