సుమారు రెండు శతాబ్దాల క్రితం పుట్టిన ఒక బానిస ఆత్మ కథ ఇది. అతని పేరు ఫ్రెడరిక్ డగ్లస్. అయన తన ఆత్మ కథలో తాను బానిసగా బతికిన రోజులని కళ్ళకు గట్టినట్టు చిత్రించాడు. మేరీల్యాండ్ నుంచి న్యూయార్కుకి ఎలా పారిపోయింది వివరించాడు. అమెరికా లో బానిసత్వాన్ని నిషేదించాలనే ఉద్యమానికి గొప్ప నాయకుడు అయ్యాడు. ఒక వక్తగా రచయితగా మేధావిగా నాయకునిగా అయన ఎలా రూపొందింది మనకు ఈ పుస్తకం తెలియచేస్తుంది. దళితుల మేధాశక్తి గురించి చులకన భావం ఉన్నవారికి అంబేద్కర్ జీవితం ఎలా సమాధానం చెప్పిందో, నల్ల బానిసల జ్ఞానం గురించి ఎగతాళి చేసిన తెల దొరల కూతలకు డగ్లస్ జీవితం అటువంటి తిరుగులేని జవాబు ఇచ్చింది.