మరణము తరువాత (Telugu): నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండ బోవుచున్నదో నీకు తెలుసునా?

· Faith Scope
4.0
87 రివ్యూలు
ఈ-బుక్
285
పేజీలు
అర్హత ఉంది

ఈ ఇ-పుస్తకం గురించి

 ప్రియపాఠకులారా!  ఏదైన ఒక గ్రంథము వ్రాయునప్పుడు అనేక వర్ణనలతో గ్రంథకర్త తనయొక్క ప్రతిభను చూపించుట జరుగును.  కాని మరణము తరువాత అను అంశము వర్ణనలతో వ్రాయటానికి ఇది చరిత్ర కాదు, కథ కూడా కాదు.  భాషా ప్రావీణ్యము తెల్పుటకు ఇది గేయములు వంటిది కాదు.  మరణమనేది ఒక నిద్ర.  ఈ నిద్రగా వర్ణించబడిన మరణమును, ఆ తరువాత ఆత్మయొక్క చరిత్ర ఎవరైనా మనకు చెప్పిన అది అర్థమగుట బహు ప్రయాసతో కూడినది, ఎందుకంటే మరణానంతర ఆత్మల చరిత్ర బహు రహస్యములతో కూడియున్నది.  అందులోను అది ఒక అదృశ్య చరిత్ర.  ఈనాడు మనకు కనిపించేదే నమ్మే స్థితిలో మనము లేము.

                అయినను బైబిలు గ్రంథము నందు మరణానంతర చరిత్రను బహు స్పష్టముగా మనకు తెలియజేయుచున్నది.  ఇందులో వ్రాయబడిన ప్రతి అంశము బైబిలు ఆధారముగా చెప్పుటకు బహు ప్రయాస పడవలసి వచ్చింది, ఎందుకంటే మరణించిన వారి ఆత్మలు ఇలా వుండును లేక అలా వుండును అంటే నమ్మేవారు ఎవరూ వుండరు.  కనుక ప్రతి విభాగమునకు బైబిలు గ్రంథములోని వాక్యములను జతపరచి చెప్పుట చేత ఈ పుస్తకము కొంతవరకు సంపూర్ణత్వము పొందినది అని చెప్పుటకు నేను సంతోషిస్తున్నాను.

                మన ఇండ్లలో మనతో ఉండి మన పితరులుగా మరణించినవారి ఆత్మలు ఎక్కడ వున్నారు?  అన్న ప్రశ్న మనలో ఆతృతను లేపుతుంది.  మన మరణానంతరము మనము ఎక్కడ వుంటాము అన్న ఆలోచన మనలో భయముతో కూడిన భీతి మనకు కలుగుతుంది.  కాని మన మరణానంతరము ఒక గొప్ప చరిత్ర జరగబోవునని గ్రహించేవారు కొందరే.  అలా దాని గూర్చి తెలుసుకోవాలనుకొనే వారికి ఈ పుస్తకము ఒక గొప్ప వరము.  . . . 

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.0
87 రివ్యూలు
KOPURI SUDHEERA
25 జూన్, 2021
Excellent
ఇది మీకు ఉపయోగపడిందా?

ఈ ఈ-బుక్‌కు రేటింగ్ ఇవ్వండి

మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.

పఠన సమాచారం

స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు
Android మరియు iPad/iPhone కోసం Google Play Books యాప్‌ ని ఇన్‌స్టాల్ చేయండి. ఇది మీ ఖాతాతో ఆటోమేటిక్‌గా సింక్ చేయబడుతుంది మరియు మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నా చదవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు
మీ కంప్యూటర్ వెబ్ బ్రౌజర్ ఉపయోగించి Google Playలో కొనుగోలు చేసిన ఆడియోబుక్‌లను మీరు వినవచ్చు.
eReaders మరియు ఇతర పరికరాలు
Kobo eReaders వంటి e-ink పరికరాలలో చదవడానికి, మీరు ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని మీ పరికరానికి బదిలీ చేయాలి. సపోర్ట్ చేయబడే ఈ-రీడర్‌లకు ఫైళ్లను బదిలీ చేయడానికి వివరణాత్మక సహాయ కేంద్రం సూచనలను ఫాలో చేయండి.