వెలుగు దారులు(Velugu Darulu)

· Panchawati Spiritual Foundation
5,0
13 arvustust
E-raamat
1278
lehekülge

Teave selle e-raamatu kohta

గత దశాబ్దకాలంగా, ఆధ్యాత్మికాన్వేషకులకు, జిజ్ఞాసువులకు రచయిత ఇచ్చిన మార్మిక సూచనలు మరియు సాధనా ఉపదేశముల సమాహారమే ఈ పుస్తకం. ఇది 360 వ్యాసములుగా విభజింపబడింది. సాధనామార్గంలో నడుస్తున్న ఒక సాధకుడు తెలుసుకోవలసిన ఆచరణాత్మకమైన సమస్త సమాచారమూ దీనిలో మీకు లభిస్తుంది.

ప్రతిచోటా పుట్టగొడుగులలాగా వెలుస్తున్న అనేకమంది గురువులూ, వారి వారి కపోల కల్పితములైన సిద్ధాంతములను సనాతనధర్మంగా ప్రచారం చేసుకోవడమూ, ఆధ్యాత్మిక రంగంలో గొప్ప గందరగోళాన్ని సృష్టించాయి. ఈ క్రమంలో పురాతన సాంప్రదాయాలైన వేదాంతము, యోగము, తంత్రముల నుండి ఎవరి ఇష్టానుసారం వారు విషయాలను తీసుకుంటున్నారు. కానీ, వాటిని సరిగ్గా వివరించడమూ లేదు, దీనిని ఫలానా చోటనుంచి తీసుకున్నామని చెప్పడమూ లేదు. వీటిని చదివినవారు అయోమయానికి గురై, తప్పుదారిన పడుతున్నారు. కనుక, ఆధ్యాత్మిక సాధనామార్గాన్నీ, దానిలోని లోతుపాతులనూ స్పష్టంగా వివరించవలసిన ఆధ్యాత్మిక అవసరం నేడు ఎంతైనా ఉన్నది.

 

భారతదేశపు ఆధ్యాత్మికజ్ఞానమంతా, అతి సులభమైన మాటలలో ఈ పుస్తకంలో వివరింపబడింది. ఇది, వేదాంతము, యోగము, తంత్రము, జ్యోతిష్యశాస్త్రం, మరియు మార్మికశాస్త్రముల లోతుపాతులను, ప్రాచీనులూ నవీనులూ అయిన మహనీయుల బోధలకు అనుగుణంగా, నిత్యజీవితానికి అన్వయిస్తూ, చక్కగా చెప్పబడింది. 


Hinnangud ja arvustused

5,0
13 arvustust

Teave autori kohta

శ్రీ సత్యనారాయణ శర్మగారు వేదాంతము, యోగము, తంత్రము, జ్యోతిష్యశాస్త్రం, వీరవిద్యలు, ప్రత్యామ్నాయ వైద్యవిధానాలలో లబ్దప్రతిష్టులు. భారతదేశం మరియు అమెరికాలలో వీరిచే స్థాపించబడిన ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని వెలుగుదారులలో నడిపిస్తున్నది. వీరి ఇతర రచనలైన – శ్రీవిద్యా రహస్యం, లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక, తారాస్తోత్రం, జాబాల దర్శనోపనిషత్తు. దత్తాత్రేయ యోగశాస్త్రము, విజ్ఞానభైరవ తంత్రము, మహాసౌరము, మహాస్మృతిప్రస్థాన సూత్రము, యోగకుండలినీ ఉపనిషత్తు, యోగ తారావళి, యోగశిఖోపనిషత్తు, యోగ తత్వోపనిషత్తు, శాండిల్యోపనిషత్తు, నాదబిందూపనిషత్తు,  వరాహోపనిషత్తు, గోరక్షసంహిత, సిద్ధసిద్ధాంత పద్ధతి, ధ్యానబిందూపనిషత్తు, ఆరు యోగోపనిషత్తులు, యోగ యాజ్ఞవల్క్యము, వైద్యజ్యోతిష్యము (మొదటి భాగము), పతంజలి యోగసూత్రములు, ఆధ్యాత్మిక జ్ఞాననిధులుగా చదువరులచే కొనియాడబడుచున్నవి.

Hinnake seda e-raamatut

Andke meile teada, mida te arvate.

Lugemisteave

Nutitelefonid ja tahvelarvutid
Installige rakendus Google Play raamatud Androidile ja iPadile/iPhone'ile. See sünkroonitakse automaatselt teie kontoga ja see võimaldab teil asukohast olenemata lugeda nii võrgus kui ka võrguühenduseta.
Sülearvutid ja arvutid
Google Playst ostetud audioraamatuid saab kuulata arvuti veebibrauseris.
E-lugerid ja muud seadmed
E-tindi seadmetes (nt Kobo e-lugerid) lugemiseks peate faili alla laadima ja selle oma seadmesse üle kandma. Failide toetatud e-lugeritesse teisaldamiseks järgige üksikasjalikke abikeskuse juhiseid.