పుస్తక నామం సూచిస్తున్నట్లుగా ఇందులో మంగళకరుడైన పరమశివుని తత్త్వమూ, వివిధ స్తోత్రములు పొందుపరచబడినాయి. పరమశివుణ్ణి సాకారరూపంగా భావిస్తే, ఆ రూపంలో ఇమిడిన తత్త్వసారం ఎంతగానో ఉన్నది. ఆ సదాశివుని చాయను మొదలుకొని నేత్రవిశేషాలు, మృగచర్మ ధారణం, జటాజూటంలోని నెలవంక, సర్పహారాలు...ఇలా ప్రతీ అంశాన్ని తత్త్వపరంగా విశ్లేషించడం ఇందు కనిపిస్తుంది. శివ మానసపూజ మొదలుకొని వివిధ శివస్తోత్రాలన్నీ ఈ పుస్తకంలో చూడవచ్చు. శివభక్తులు తప్పక చదవవలసిన పుస్తకం ఇది. ఉపాసన పరంగా, జ్ఞాన పరంగా ఇది ఒక చక్కని పుస్తకం.
Our other books here can be searched using #RKMathHyderabad