Aparokshanubhuti(అపరోక్షానుభూతి)

· Panchawati Spiritual Foundation
5.0
3 రివ్యూలు
ఈ-బుక్
141
పేజీలు

ఈ ఇ-పుస్తకం గురించి

ఆదిశంకరులచే రచింపబడి మనకు లభిస్తున్న గ్రంథములలో మణిపూస వంటిది ఈ అపరోక్షానుభూతి. జ్ఞానమార్గసాధన ఈ గ్రంథములో మెట్టుమెట్టుగా వివరింపబడినది. సాధనామార్గమున కావలసిన అర్హతలైన సాధనాసంపత్తిని వివరించిన తర్వాత, ఆత్మ యన్నది దేహం కాదని అనేక ఉదాహరణల ద్వారా చెప్పి, ఆపైన, దేహం కూడా ఆత్మలో భాగమేనని ఆచార్యులవారు వివరించారు. ఉన్నది ఆత్మయేనని, దేహమనిన భావన ఒక భ్రమమాత్రమేనని, ఆ ఆత్మ కూడా బ్రహ్మమే దప్ప వేరొకటి కాదనిన బోధనలు ఈ గ్రంథంలో లభిస్తున్నాయి. చివరిగా, ఈ బ్రహ్మనుభూతిని అందుకునే క్రమంలో, పదిహేను మెట్లతో కూడిన యోగ, జ్ఞానమార్గముల మిశ్రమం సాధనాపరంగా ఉపదేశింపబడింది. అద్వైతాభిమానులకు మా వ్యాఖ్యానం మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాం.

రేటింగ్‌లు మరియు రివ్యూలు

5.0
3 రివ్యూలు

రచయిత పరిచయం

శ్రీ సత్యనారాయణ శర్మగారు వేదాంతము, యోగము, తంత్రము, జ్యోతిష్యశాస్త్రం, వీరవిద్యలు, మరియు ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో లబ్దప్రతిష్ఠులు. భారతదేశము మరియు అమెరికా సంయుక్త రాష్ట్రములలో వీరిచే స్థాపించబడిన ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని వెలుగుదారులలో నడిపిస్తున్నది. వీరి ఇతర రచనలైన, శ్రీవిద్యా రహస్యమ్, లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక, తారాస్తోత్రమ్, దత్తాత్రేయ యోగశాస్త్రము, జాబాల దర్శనోపనిషత్తు, మహాసౌరము, విజ్ఞానభైరవ తంత్రము, మహాస్మృతిప్రస్థానసూత్రము, ధమ్మపదము, యోగకుండలినీ ఉపనిషత్తు, యోగతత్త్వోపనిషత్తు, యోగశిఖోపనిషత్తు, యోగతారావళి, శాండిల్యోపనిషత్తు, వరాహోపనిషత్తు, ఆరు యోగోపనిషత్తులు, నాదబిందూపనిషత్తు, ధ్యానబిందూపనిషత్తు, సిద్ధసిద్ధాంతపద్ధతి, గోరక్షసంహిత, యోగయాజ్ఞవల్క్యము, పతంజలి యోగసూత్రములు, వైద్యజ్యోతిష్యం - మొదటి భాగం, వెలుగుదారులు, శ్రీమాలినీ విజయోత్తర తంత్రము, తంత్రసారము, ఆత్మబోధ ఆధ్యాత్మిక జ్ఞాననిధులుగా చదువరులచే కొనియాడబడుచున్నవి.

ఈ ఈ-బుక్‌కు రేటింగ్ ఇవ్వండి

మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.

పఠన సమాచారం

స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు
Android మరియు iPad/iPhone కోసం Google Play Books యాప్‌ ని ఇన్‌స్టాల్ చేయండి. ఇది మీ ఖాతాతో ఆటోమేటిక్‌గా సింక్ చేయబడుతుంది మరియు మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నా చదవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు
మీ కంప్యూటర్ వెబ్ బ్రౌజర్ ఉపయోగించి Google Playలో కొనుగోలు చేసిన ఆడియోబుక్‌లను మీరు వినవచ్చు.
eReaders మరియు ఇతర పరికరాలు
Kobo eReaders వంటి e-ink పరికరాలలో చదవడానికి, మీరు ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని మీ పరికరానికి బదిలీ చేయాలి. సపోర్ట్ చేయబడే ఈ-రీడర్‌లకు ఫైళ్లను బదిలీ చేయడానికి వివరణాత్మక సహాయ కేంద్రం సూచనలను ఫాలో చేయండి.