యువాల్ నోఆ హరారీ మన నమ్మకాలు ఏవైనా కానీయండి, కానీ మన ప్రపంచానికి పునాదులైన వృత్తాంతాల పైన ప్రశ్నలు వేయడాన్ని, గతంలోని సంఘటనలని వర్తమానంలోని వ్యవహారాలతో జోడించడాన్ని, వివాదాస్పదమైన విషయాలకు భయపడకుండా ఉండటాన్ని ప్రోత్సహిస్తూంటాను. డా. యువల్ నోఆ హరారీ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలంలో 'చరిత్ర'లో పి.హెచ్‌డి చేశారు. ప్రపంచ చరిత్రను లోతుగా చదివారు. ప్రస్తుతం వారు హీబ్రూ విశ్వవిద్యాలయం, జెరూసలేంలో అధ్యాపకుడిగా ఉన్నారు. వారి పుస్తకాలు సేపియన్స్, హోమో డెయూస్ అంతర్జాతీయ స్థాయిలో చర్చించబడ్డాయి. 21 లెసన్స్ ఫర్ ది 21 సెంచరీ, సేపియన్స్: గ్రాఫిక్ హిస్టరీ. వీరి పుస్తకాలు 60 భాషలలో 27.5 మిలియన్లకు పైగా అమ్ముడయ్యాయి. ప్రపంచంలో ప్రభావవంతమైన మేధావులలో ఒకరిగా ఖ్యాతినార్జించారు.