భగవంతుణ్ణి చేరుకోవడానికి భారతీయతత్త్వశాస్త్రం నాలుగు మార్గాలను బోధించింది. అవి - కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాలు. వీటిలో అన్నింకన్నా తేలిక అయినది, సులభంగా ఆచరించగలిగినది భక్తియోగ మార్గం. భక్తియోగం పారమార్థిక లబ్ధిని పొందడానికి భగవన్నామ జపసంకీర్తనలు మార్గాలు అని పేర్కొంటుంది. ఈ మార్గంలో భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తుడు పాటించాల్సిన పద్ధతులు, నియమాలు, అలాగే సాధనాపథంలో భక్తునిలో కలిగే మార్పులు ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. శ్రీరామకృష్ణులు ఉటంకించిన సూక్తులను ప్రతి భక్తి సూత్రానికి జోడించడం జరిగింది.
Our other books here can be searched using #RKMathHyderabad