లోకాన్ని పావనం గావించే విధంగా ధర్మాచరణ గావించిన ఆ సనాతన భారతీయ ఋషుల దివ్యానుభూతుల సమాహారమే వేదాలు. ఈ ఉపనిషత్తు అథర్వణ వేదానికి చెందినది. ఈ లోకం ఎలా ఆవిర్భవించింది? ప్రాణులు ఎలా ఉద్భవించాయి? భగవంతుడెవరు? మనిషి ఎవరు? భగవంతునికి, మనిషికి ఉన్న సంబంధమేమి? వంటి కొన్ని ప్రాథమిక ప్రశ్నలను మనస్సులో ఉంచుకొని భారతదేశ పలు ప్రాంతాలనుండి ఆరుగురు జిజ్ఞాసువులు జ్ఞానాన్వేషణకై పిప్పలాద మహర్షి వద్దకు వచ్చారు. వారు ఆయనను అడిగిన ఆరు ప్రశ్నలూ, వారికి మహర్షి ఇచ్చిన సమాధానాలే ఈ ప్రశ్నపనిషత్తు.
Our other books here can be searched using #RKMathHyderabad