స్వామి వివేకానంద రెండవసారి పాశ్చాత్య దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు కలకత్తా నుంచి ఐరోపా వరకు ఆయన చేసిన యాత్ర యొక్క విశేషాలు ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. మార్గమధ్యంలోని అనేక పట్టణాలు, దేశాల గురించి, అక్కడ నివసించే జాతుల గురించీ, అవసరమైన చోట్ల ఆయా ప్రదేశాలను, జాతులను మన భారతదేశంతోనూ, మన సంస్కృతితోనూ పోలుస్తూ చెప్పే వివరాలనుబట్టి స్వామీజీకి ఆయా విషయాలపై ఉన్న అపార జ్ఞాన సంపత్తిని అర్థం చేసుకోవచ్చు. కొన్ని కొన్ని చోట్ల విశేషాలను సునిశిత హాస్యంతో మేళవించి చెప్పారు. యాత్రా మార్గంలో ఉన్న మదరాసు (చెన్నై), కొలంబో (శ్రీలంక) వంటి పట్టణాల గురించి, అలాగే స్వామీజీ పర్యటించిన ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఈజిప్ట్ దేశాల గురించి అనేక విషయాలు ఇందులో చెప్పబడ్డాయి.
Our other books here can be searched using #RKMathHyderabad