బరువు తగ్గడం మీ లక్ష్యమా? క్యాలరీ కౌంటర్‌లో AI ఫోటో స్కాన్‌తో భోజనం లెక్కలను మొదలుపెట్టండి. ఆహార డైరీ ద్వారా తిన్నది, రోజుకు మిగిలిన క్యాలరీలు తెలుసుకుని మీ ఆహారాన్ని గమనించండి.
📷 ఫోటో స్కాన్ నుంచి భోజనం నమోదు వరకు
కెమెరాతో ఫోటో తీయండి లేదా గ్యాలరీ నుంచి చిత్రాన్ని ఎంచుకోండి. AI ఇచ్చే ఆహారం, పరిమాణం, క్యాలరీల విలువలు అంచనాలు మాత్రమే; వాటిని పరిశీలించి సవరించుకోవచ్చు. ప్రోటీన్ లెక్కలు, పిండి పదార్థాలు, కొవ్వును కూడా చూడండి. ఆహారం పేరు, మొత్తం బరువు, ఒక్కో పదార్థం పేరు లేదా బరువును మార్చండి. పదార్థాలను చేర్చడం, తొలగించడం, ప్రధాన పోషక విలువలను సవరించడం ద్వారా తిన్నదానికి తగ్గట్టు నమోదు చేయండి. మొత్తం విలువలను యాప్ మళ్లీ లెక్కిస్తుంది.
ఆహార డైరీ: మీకు వీలైన పద్ధతిలో
ఫోటో స్కాన్ చేయలేనప్పుడు వివరాలను మీరే నమోదు చేయండి. ప్యాక్ చేసిన ఆహారానికి బార్‌కోడ్ స్కాన్ వాడండి; ఉత్పత్తి సమాచారం అందుబాటులో ఉంటే వివరాలు వస్తాయి. తరచూ తినే పదార్థాలను ఇష్టమైనవిగా దాచుకుని, వాటిలో వెతికి మళ్లీ చేర్చండి. మాన్యువల్ ఆహార నమోదు, నీరు, బరువు ట్రాకింగ్ ప్రాథమిక సదుపాయాలు; అదనపు ప్రీమియం ప్రయోజనాలు కింద ఉన్నాయి.
రోజు లక్ష్యాన్ని అర్థం చేసుకోండి
క్యాలరీ కౌంటర్ మీ వివరాలు, శారీరక చురుకుదనం, లక్ష్యానికి తగ్గ రోజువారీ ఆహార లెక్కలను చూపిస్తుంది. బరువు తగ్గడం, ఉన్న బరువును నిలుపుకోవడం లేదా కండరాలు పెంచుకోవడం కోసం తీసుకునే ఆహారాన్ని గమనించండి. క్యాలరీలు, ప్రధాన పోషకాల లక్ష్యాలను మీరే మార్చుకోవచ్చు. ప్రోటీన్ లెక్కలు సహా తీసుకున్న మొత్తం, రోజుకు మిగిలిన పరిమితిని హోమ్ లేదా డైరీలో చూడండి. క్యాలరీ లోటును అనుసరిస్తున్నప్పుడు రోజువారీ నమోదులను లక్ష్యంతో పోల్చుకోండి.
📊 అలవాట్లలో మార్పును గమనించండి
క్యాలరీ వలయం ఆ రోజు లక్ష్యంలో ఎంత పూర్తయిందో చూపిస్తుంది. ఆహార డైరీ క్యాలెండర్‌లో వరుసగా నమోదు చేసిన రోజులు కనిపిస్తాయి. వారం, నెల, సంవత్సరం వారీ చార్ట్‌లతో ఆహార లెక్కలు పరిశీలించండి. బరువు తగ్గడం కోసం చేసిన మార్పులను అర్థం చేసుకోవడానికి బరువు నమోదులూ ఉపయోగపడతాయి. ఒక్క రోజు లెక్కతోనే నిర్ణయానికి రాకుండా కాలక్రమంలో మార్పులను చూడండి.
💧 నీరు, హోమ్ స్క్రీన్ విడ్జెట్‌లు
తాగిన నీటిని నమోదు చేసి నీటి లక్ష్యంతో పోల్చండి. భోజనం, నీరు తాగే వేళలకు రిమైండర్‌లను పెట్టుకోండి. క్యాలరీ కౌంటర్‌లోని విడ్జెట్‌లు రోజువారీ క్యాలరీలు, ప్రోటీన్ లెక్కలు, ఇతర ప్రధాన పోషకాలను హోమ్ స్క్రీన్‌పైనే చూపిస్తాయి. నీటి విడ్జెట్‌తో లక్ష్యం చూడండి, తాగిన నీటిని నేరుగా చేర్చండి. త్వరిత కెమెరా విడ్జెట్‌తో ఫోటో స్కాన్ ప్రారంభించండి. చిన్న విరామంలోనే నమోదు చేయడానికి ఈ సదుపాయాలు ఉపయోగపడతాయి.
ప్రీమియంతో మరింత వివరంగా
- తిన్నదాన్ని రాసి లేదా మాట్లాడి చెప్పి AI అంచనాలు పొందండి.
- పలు పదార్థాలను ఒక భోజనంగా దాచుకుని, మరోసారి మొత్తం భోజనాన్ని చేర్చండి.
- ప్రోటీన్ లెక్కలు మాత్రమే కాకుండా, సమాచారం అందుబాటులో ఉన్నప్పుడు పీచు, చక్కెర, సోడియం, విటమిన్లు, ఖనిజాల వివరాలు, పోషకాల చార్ట్‌లు చూడండి.
- సరిపడా నమోదులు ఉంటే వారపు AI సమీక్షలో అలవాట్లు, లక్ష్యంతో పోలిక, రోజువారీ సూచనలు పొందండి. బరువు తగ్గడం లేదా బరువు నిలుపుకోవడం వంటి మీ లక్ష్యం దిశగా నమోదులను పరిశీలించండి.
Health Connectతో అనుసంధానం
మద్దతు ఉన్న Android పరికరాల్లో మీ అనుమతితో Health Connectలో నమోదైన ఖర్చయిన క్యాలరీలను పొందండి. వాటిని తిన్న ఆహారం ద్వారా తీసుకున్న క్యాలరీలతో పోల్చండి. పోషక నమోదులను Health Connectకు పంపవచ్చు; బరువు వివరాలను రెండు వైపులా సమకాలీకరించవచ్చు.
పంచుకోండి, నకలు దాచుకోండి
ఆహార డైరీ నమోదును చిత్రంగా లేదా వచనంగా పంచుకోండి. డైరీ, ఫోటోలు, నీరు, బరువు నమోదుల నకలును ఎగుమతి చేసి తిరిగి దిగుమతి చేయవచ్చు. లైట్ లేదా డార్క్ థీమ్, మెట్రిక్ లేదా ఇంపీరియల్ కొలమానాలను ఎంచుకోండి.
రోజుకు ఆహారం చేర్చే పరిమితి మీ యాక్సెస్‌పై ఆధారపడి ఉంటుంది. చేతితో నమోదు చేసినవి, ఇష్టమైనవాటి నుంచి చేర్చినవి కూడా లెక్కలోకి వస్తాయి. ప్రస్తుత పరిమితిని యాప్‌లో చూడండి.
ఇది వైద్య పరికరం కాదు. వ్యాధులను నిర్ధారించడం, చికిత్స చేయడం, నయం చేయడం లేదా నివారించడం దీని పని కాదు. వైద్య సలహా, నిర్ధారణ లేదా చికిత్స కోసం అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.
AIతో ఫోటో నుంచి క్యాలరీలను అంచనా వేయండి. ఆహార డైరీ, ప్రోటీన్, బరువు లెక్కలు.
అప్‌డేట్ అయినది
1 అక్టో, 2026