Vijnana Bhairava Tantramu (విజ్ఞాన భైరవ తంత్రము)

· Panchawati Spiritual Foundation
4.8
5 reviews
Ebook
132
Pages

About this ebook

విజ్ఞాన భైరవ తంత్రమన్నది భైరవాగమము నందు గల రుద్రయామళ తంత్రమునందొక భాగము. ఇది జ్ఞానతంత్రము. అనగా, భౌతికములైన తంతులతో సంబంధము లెని ధారణా విధానములు దీనిలో చెప్పబడినవి. నూట పన్నెండు పైగా ధారణా విభాగములు దీనిలో ఉన్నవి. నేడు ప్రపంచమంతటా గురువులు భోధించుచున్నవి, ఉపాసకులు చెయుచున్నవి అయిన సాధనలన్నియు ఈ తంత్రమున లభిస్తాయి.

దక్షిణ భారతము కంటే ఉత్తర, తూర్పు భారతమున దీని ఉపాసకులు ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు ముఖ్యముగా, కాశ్మీర వీరశైవమునకు చెందిన త్రికసాంప్రదాయలగు కౌలాచారులకు ఇది ప్రామాణిక గ్రంథము. ఈ ధారణల పైన అనేకులు ఇప్పటికే ఎవరికి తోచినట్లుగా వారు వ్యాఖ్యానించి యున్నారు. నా సాధనానుభవములను బట్టి నాకర్థమైనట్లుగా నేనును ఈ వ్యాఖ్యానమును గావించాను.

ప్రాణ నిగ్రహము, మనో నిగ్రహము, ధారణ, ధ్యానములు అలవాటైన వారు మాత్రమే ఈ సాధనలను చేయగలరు. మిగతా వారికి ఊరకే చదివి ఆనందించుటకు మాత్రమే ఇవి ఉపయొగిస్తాయి. సాధకులకు ఇదొక గైడ్ బుక్ అని చెప్పవచ్చును. అనవసరములైన సిద్ధాంతములు, చర్చల జోలికి పోకుండా, ఆచరణాత్మకమైన ధారణా విధానములను సూటిగా భోదించుట ఆ తంత్రము యొక్క ప్రత్యేకత.

తంత్ర మార్గమునందు నడిచే ఇచ్చ ఉన్నవారు, సమర్థుడైన గురువును అన్వేషించి, ఆయన ద్వారా ఈ ధారణల యొక్క లోతుపాతులను గ్రహించి, వాటిని అభ్యసించినచో, అవి సూచించునట్టి అనుభవములను పొందగలుగుతారు.

Ratings and reviews

4.8
5 reviews

About the author

శ్రీ సత్యనారాయణ శర్మ గారు జ్యోతిష్యము, యోగము, తంత్రము, వీరవిద్యలు, ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో ప్రవీణులు. భారతదేశముననూ, అమెరికా సంయుక్తరాష్ట్రలలోనూ వీరు స్థాపించిన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని ఆధ్యాత్మికమార్గంలో ఉత్తేజితుల్ని చేస్తున్నది.

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.