పన్నెండవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం మధ్యలో మహారాష్ట్రలో జన్మించి పాండురంగడిని సేవించి తరించిన భక్తవరేణ్యుల జీవితగాథలు ప్రాపంచిక జీవితపు బాధ్యతలను విస్మరించకుండానే భగవద్భక్తిని పెంపొందించుకొని, నామసంకీర్తనతో, నామోచ్చారణతోనే భగవంతుణ్ణి చేరుకోవచ్చని నిరూపించాయి. భగవంతుడిపై అచంచల విశ్వాసం కలిగినవారు ఎలాంటి గడ్డుపరిస్థితులను అయినా సునాయాసంగా అధిగమించగలరని వీరి జీవితాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. జ్ఞానేశ్వర్, నామదేవ్, తుకారాం, సమర్థ రామదాస్, సక్కుబాయి వంటి 21 మంది మహాభక్తుల జీవిత చరిత్రలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.
Our other books here can be searched using #RKMathHyderabad