కృష్ణ యజుర్వేదంలోని తైత్తిరీయ ఆరణ్యకంలో అంత్యభాగంగా నారాయణోపనిషత్తు పొందుపరచబడినది. ఇందు పరబ్రహ్మ తత్త్వంకన్నా యజ్ఞవిధికి సంబంధించిన వివిధ సంహితా భాగమంత్రాలు ఉండటంచే దీనికి యాజ్ఞికోపనిషత్ అని కూడా పేరు ఉంది. నిత్యానుష్ఠానమైన సంధ్యావందనాది కర్మలలో అగ్న్యాది దేవతల ఆవాహనకు నిర్దేశించిన మంత్రాలు, రుద్రాది దేవతల అభిషేకం, అర్చన సమయాల్లో వినబడే మంత్రాలు ఇందులోనివే. అందుచేతనే దీనిని మహానారాయణోపనిషత్ అని ఆంటారు. గ్రంథంలోని మంత్రాలకు సరళమైన శైలిలో తెలుగు వ్యాఖ్యానము ఇవ్వబడినది. జిజ్ఞాసువులకు ఉపయుక్తంగా ఈ పుస్తకం నిలుస్తుందనేది మా ఉద్దేశ్యం.
Our other books here can be searched using #RKMathHyderabad