18వ శతాబ్దానికి చెందిన రాంప్రసాద్ కాళీమాత భక్తుడు, బెంగాళ్ వాస్తవ్యులు. వీరు శ్రీ త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితర్, శామశాస్త్రి మొదలైన వాగ్గేయకారుల సమకాలికులు. భక్తజనకోటికి కూడా రాంప్రసాద్ పాటలంటే ఎంతో ప్రీతి. భగవాన్ శ్రీరామకృష్ణులు పరమపారవశ్యంతో గానం చేసే ఎన్నో పాటలు వీరు వ్రాసినవే. ఆసక్తిదాయకమైన సంఘటనలతో కూడిన ఆ మహనీయుని జీవిత కథ ఈ పుస్తకంలో పొందుపరచబడింది. ఎందరో సాధకులకు, భక్తులకు ఇతని కథ స్ఫూర్తినిస్తుంది.
Our other books here can be searched using #RKMathHyderabad