FamilyLink పేరెంటల్ కంట్రోల్స్

1.6
324వే రివ్యూలు
50మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Family Link తల్లిదండ్రుల కంట్రోల్స్ అనేది తల్లిదండ్రుల కోసం Family Linkకు ఒక సహచర యాప్. ఈ యాప్‌ను చిన్నారి లేదా యువకులు ఉపయోగించే పరికరంలోనే డౌన్‌లోడ్ చేయండి.

Google అందించే Family Link తల్లిదండ్రుల కంట్రోల్స్ యాప్ ట్రై చేయండి. మీ పిల్లలు చిన్నవారైనా లేదా యుక్త వయస్కులైనా, వారు నేర్చుకుంటున్నప్పుడు, ఆటలు ఆడుతున్నప్పుడు, ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్నప్పుడు వారిని గైడ్ చేయడం కోసం రిమోట్ విధానంలో మీ స్వంత పరికరం నుండి డిజిటల్ నియంత్రణ నియమాలను సెట్ చేయడానికి Family Link యాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది. 13 ఏళ్ల లోపు (లేదా మీ దేశంలో వర్తించే సమ్మతి ఇవ్వగలిగే వయస్సు) పిల్లల కోసం ఉద్దేశించిన Family Link సాయంతో మీ ఖాతాలాగే మీ చిన్నారికి అత్యధిక Google సర్వీస్‌లను యాక్సెస్ చేయగల Google ఖాతాను క్రియేట్ చేయవచ్చు.


Family Link తల్లిదండ్రుల కంట్రోల్స్‌తో, మీరు చేయగలిగేవి:

వారిని మంచి కంటెంట్ వైపు గైడ్ చేయడం

• వారి యాప్ యాక్టివిటీని చూడటం - పరికర వినియోగ వ్యవధి మొత్తం ఒకేలా ఉండదు. మీ చిన్నారి వారి Android పరికరంలో ఏమి చేస్తారు అనే దాని గురించి, వారి ఇష్టమైన యాప్‌లలో ఎంత సమయం గడుపుతున్నారో సూచించే యాక్టివిటీ రిపోర్ట్‌లతో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడండి. మీరు రోజు, వారం లేదా నెలవారీ రిపోర్ట్‌లను చూడవచ్చు.
• వారి యాప్‌లను మేనేజ్ చేయండి - Google Play Store నుండి మీ చిన్నారి డౌన్‌లోడ్ చేయాలనుకొనే యాప్‌లను సులభ నోటిఫికేషన్‌ల ద్వారా మీరు ఆమోదించవచ్చు లేదా బ్లాక్ చేయవచ్చు. మీరు యాప్‌లో కొనుగోళ్లు నిర్వహించడం, వారి పరికరంలో నిర్దిష్ట యాప్‌లను దాచడం, ఇవన్నీ కూడా రిమోట్ విధానంలో మీ పరికరం నుండి చేయగలరు.
• వారి ఆతృతను తీర్చండి - మీ చిన్నారి కోసం తగిన యాప్‌లు ఏవో గుర్తించడం కష్టం కావచ్చు, కాబట్టి వారి పరికరానికి నేరుగా జోడించగలిగే ఉపాధ్యాయులు సిఫార్సు చేసిన యాప్‌లను Family Link మీకు చూపిస్తుంది.


పరికర వినియోగ వ్యవధిని గమనిస్తూ ఉండవచ్చు

• పరిమితులను సెట్ చేయండి - మీ చిన్నారి కోసం పరికర వినియోగ వ్యవధి ఎంత ఉండాలన్నది మీరే నిర్ణయించవచ్చు. Family Linkతో, మీరు పర్యవేక్షించే పరికరాల కోసం కాల పరిమితులను, నిద్రించే సమయాన్ని సెట్ చేసే వీలుంటుంది, తద్వారా మీరు వారి జీవితంలో సమతుల్యాన్ని తీసుకు రావడంలో సహాయపడవచ్చు.
• వారి పరికరాన్ని లాక్ చేయండి - బయట ఆడుకోవాల్సిన సమయం, రాత్రి భోజన సమయం లేదా కలిసి గడపాల్సిన సమయాలలో, అంటే ఎప్పుడైనా విరామం తీసుకోవాల్సినప్పుడు పర్యవేక్షించబడే పరికరాన్ని రిమోట్‌గా లాక్ చేయవచ్చు.


వారు ఎక్కడ ఉన్నారో చూడవచ్చు

• మీ చిన్నారి ప్రయాణంలో ఉన్నప్పుడు వారెక్కడున్నారో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. వారి వద్ద Android పరికరం ఉన్నంత వరకు వారి ఉనికిని తెలుసుకోవడానికి మీరు Family Linkను ఉపయోగించవచ్చు.


ముఖ్యమైన సమాచారం

• మీ చిన్నారి పరికరాన్ని బట్టి Family Link టూల్స్ మారుతూ ఉంటాయి. families.google.com/familylink/setup
లింక్‌లో అనుకూల పరికరాల లిస్ట్ చూడండి • Google Playలో మీ చిన్నారి చేసే కొనుగోళ్లు, డౌన్‌లోడ్‌లను మేనేజ్ చేయడంలో Family Link మీకు సహాయపడినా, యాప్ అప్‌డేట్‌లు, మీరు ముందే ఆమోదించిన యాప్‌లు (అదనపు అనుమతులు ఉండాల్సిన అప్‌డేట్‌లతో సహా) లేదా ఫ్యామిలీ లైబ్రరీలో షేర్ చేసిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి వారికి ఆమోదం అవసరం ఉండదు. తల్లిదండ్రులు Family Linkలో చిన్నారి ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు, యాప్ అనుమతులను నిత్యం రివ్యూ చేయాలి.
• మీరు పర్యవేక్షించే మీ చిన్నారి పరికరంలోని యాప్‌లను మీరు జాగ్రత్తగా రివ్యూ చేసి, వారు వాడకూడదని మీరు అనుకునే వాటిని డిజేబుల్ చేయాలి. ముందే ఇన్‌స్టాల్ అయిన కొన్ని యాప్‌లను మీరు డిజేబుల్ చేయలేకపోవచ్చని గమనించండి.
• చిన్న వయస్సులో లేదా యుక్త వయస్సులో ఉన్న మీ పిల్లల పరికర లొకేషన్‌ను చూడటానికి, అది తప్పక ఆన్‌లో ఉండాలి, ఇటీవల యాక్టివ్‌గా ఉండాలి, ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసి ఉండాలి.
• ఉపాధ్యాయులు సిఫార్సు చేసిన యాప్‌లు USలో, నిర్దిష్ట వయస్సు గల పిల్లల తల్లిదండ్రులకు Android పరికరాలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
• Family Link మీ చిన్నారి ఆన్‌లైన్ అనుభవాన్ని మేనేజ్ చేయడానికి టూల్స్ అందించినా, దాని వలన ఇంటర్నెట్ అనుభవం సురక్షితం అయిపోదు. దాని కంటే కూడా, ఇది పిల్లలు ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగించాలో వారి తల్లిదండ్రులు నిర్ణయించగల ఎంపికలను అందించేందుకు, ఇంటర్నెట్ వినియోగం గురించి వారి మధ్య సంభాషణలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించినది.
అప్‌డేట్ అయినది
3 జూన్, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, యాప్ యాక్టివిటీ ఇంకా 2 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

1.5
299వే రివ్యూలు

కొత్తగా ఏముంది

కొన్ని స్థిరత్వ మెరుగుదలలతో పాటు, బగ్ పరిష్కారాలు చేయబడ్డాయి.