Google Kids Space

3.7
3.27వే రివ్యూలు
10మి+
డౌన్‌లోడ్‌లు
టీచర్లు ఆమోదించినది
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Google Kids Space అనేది 9 ఏళ్లలోపు పిల్లలకు అనుకూల మొదటి స్క్రీన్, క్వాలిటీ కంటెంట్ లైబ్రరీతో కూడిన టాబ్లెట్ అనుభూతిని ఇస్తుంది. ప్రత్యేకమైన అవతార్‌ల ద్వారా పిల్లలు తమ ఎక్స్‌పీరియన్స్‌ను తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు, అలాగే తమ ఆసక్తుల ఆధారంగా కంటెంట్ సిఫార్సులను అందుకుంటారు. వీటిపై తల్లిదండ్రుల కంట్రోల్స్ సాయంతో తల్లిదండ్రులు పరిమితులను సెట్ చేయవచ్చు.

Google Kids Space ఉపయోగించాలంటే, మీ చిన్నారికి ఒక Google ఖాతా ఇంకా అనుకూలమైన Android పరికరం అవసరం.

టీచర్‌లు ఆమోదించిన యాప్‌లు, గేమ్‌లు
Google Kids Space అనేది Google Play నుండి వచ్చే యాప్‌లు, గేమ్‌లతో కూడి ఉంటుంది, ఇవి టీచర్‌ల చేత, చిన్నారుల విద్య, మీడియా స్పెషలిస్ట్‌ల చేత ఆమోదించబడి ఉంటాయి. టీచర్‌లు ఆమోదించిన యాప్‌లు, వయసుకు తగినట్లుగా, ఆలోచనాత్మకంగా రూపొందించబడి, ఆహ్లాదకరంగా లేదా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.

Google Kids Space అందించే సిఫార్సుల కన్నా ఎక్కువ సౌలభ్యాన్ని కోరుకునే తల్లిదండ్రుల కోసం, మీరు Google Play Store నుండి పేరెంట్స్ మెనూ ద్వారా మరింత ఎక్కువ కంటెంట్‌ను జోడించవచ్చు.

పిల్లల పుస్తక నిపుణులచే ఎంపిక చేయబడిన పుస్తకాలు
ఎంతో నైపుణ్యంతో సేకరించిన Play Books క్యాటలాగ్, చదవడంపై ఇష్టం పెరిగేలా చేస్తుంది. మీకు తెలిసిన ఉల్లాసభరితమైన టైటిల్స్ ఇంకా క్యారెక్టర్‌లతో, ట్రక్కుల నుండి బ్యాలెట్ వరకు అన్ని టాపిక్‌లను కవర్ చేసే క్లాసిక్ పుస్తకాలు, కొత్త రకమైన కథలు ఉన్నాయి. పిల్లలు తమ కొత్త ఆసక్తులకు అనుగుణంగా కనుగొనవచ్చు లేదా వారికి ఇష్టమైన కొన్ని కథలను మళ్లీ చూడవచ్చు.

గొప్ప కంటెంట్‌తో సిఫార్సు చేయబడిన వీడియోలు
YouTube Kidsలోని వీడియోల ద్వారా, పిల్లలు తమ నైపుణ్యాలను క్రియేట్ చేసుకోవడానికి, డిస్కవర్ చేయడానికి ఇంకా వాటిని ప్రాక్టీసు చేయడానికి స్ఫూర్తిని పొందవచ్చు, తద్వారా తమ చేతలతో క్రియేటివిటీని చూపాలని, ఆడుకోవాలని వారికి అనిపిస్తుంది. వారు, సాధారణ డ్రాయింగ్ యాక్టివిటీల నుండి సిల్లీ సైన్స్ ప్రాజెక్ట్‌ల వరకు, అన్నింటి గురించి వీడియోలను కనుగొంటారు. పిల్లలు నేర్చుకోవాలన్నా, పాడాలన్నా, నవ్వాలన్నా, వారు ఇష్టపడే టాపిక్‌లు ఇంకా క్యారెక్టర్‌ల గురించిన వీడియోలను అన్వేషించవచ్చు.

పిల్లల్లో ఉండే కుతూహలాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది
అది జంతువులకు సంబంధించినది కావచ్చు లేదా ఆర్ట్ ప్రాజెక్ట్‌ల గురించి కావచ్చు, ఏదైనా గానీ, పిల్లలు వారు ఇష్టపడే విషయాలలో చిన్నారి నిపుణులుగా తయారవుతారు. తమకు ఇష్టమైన విషయాలను అన్వేషించడంలో అలాగే కొత్తవైన, ఆకట్టుకునే మార్గాలలో వాటి గురించి నేర్చుకోవడంలో సహాయపడే విధంగా Google Kids Space రూపొందించబడింది. పిల్లలు తమ స్వంత క్యారెక్టర్‌ను క్రియేట్ చేసుకోవడం ద్వారా తమ ఎక్స్‌పీరియన్స్‌ను అనుకూలంగా మార్చుకోవచ్చు, వారు లాగిన్ అయినప్పుడు స్క్రీన్ పైన అవి కనిపిస్తాయి.

తల్లిదండ్రుల కంట్రోల్స్ ద్వారా సరిహద్దులను సెట్ చేయండి
Googleకు చెందిన Family Link యాప్‌లోని తల్లిదండ్రుల కంట్రోల్స్‌తో, మీరు మీ స్వంత పరికరం నుండి Google Playలోని కంటెంట్‌ను మేనేజ్ చేయడం, పరికర వినియోగ వ్యవధి పరిమితులను సెట్ చేయడం ఇంకా మరిన్నింటి ద్వారా మీ చిన్నారి ఎక్స్‌పీరియన్స్‌ను గైడ్ చేయవచ్చు.

ముఖ్యమైన సమాచారం
Google Kids Space మీ పిల్లల టాబ్లెట్ మొదటి స్క్రీన్‌ను, వారికి తెలిసిన ఇష్టమైన కంటెంట్ అయిన యాప్‌లు, గేమ్‌లు, వీడియోలు ఇంకా పుస్తకాల కోసం ట్యాబ్‌లుగా మార్చడంలో, నిర్వహించడంలో సహాయపడుతుంది. పేరెంట్ మెనూలో ఏ సమయంలోనైనా Google Kids Spaceను ఆఫ్ చేయవచ్చు.

Google Kids Spaceను ఉపయోగించడానికి, మీ చిన్నారికి Google ఖాతా అవసరం. తల్లిదండ్రుల కంట్రోల్స్ కోసం Family Link యాప్‌ను సపోర్ట్ చేసే Android Chromebook లేదా iOS లాంటి పరికరం ఉండటం అవసరం. ఫీచర్‌ల లభ్యత ప్రాంతాల వారీగా మారవచ్చు. Google Kids Space, ఎంపిక చేసిన Android టాబ్లెట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. Google Kids Spaceలో Google Assistant అందుబాటులో లేదు.

పుస్తకాలు, వీడియో కంటెంట్ అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉండక పోవచ్చు. వీడియో కంటెంట్ అనేది YouTube Kids యాప్‌నకు సంబంధించిన లభ్యతకు లోబడి ఉంటుంది. Books కంటెంట్‌కు Play Books యాప్ అవసరం. యాప్‌లు, పుస్తకాలు, ఇంకా వీడియో కంటెంట్‌ల లభ్యత అనేది ఎలాంటి నోటీసు లేకుండా మారవచ్చు.
అప్‌డేట్ అయినది
1 జులై, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఆర్థిక సమాచారం ఇంకా 3 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
Play ఫ్యామిలీ పాలసీని ఫాలో కావడానికి కట్టుబడి ఉంటాము
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.5
422 రివ్యూలు

కొత్తగా ఏముంది

వివిధ బగ్ పరిష్కారాలు, స్థిరత్వ మెరుగుదలలు.