Google Chrome చాలా వేగవంతమైన, ఉపయోగించడానికి సులభమైన మరియు సురక్షితమైన వెబ్ బ్రౌజర్. Android కోసం రూపొందించబడిన Chrome మీకు వ్యక్తిగతీకరించిన వార్తా కథనాలు, మీకు ఇష్టమైన సైట్‌లకు త్వరిత లింక్‌లు, డౌన్‌లోడ్‌లు మరియు Google శోధన, Google అనువాదం ఫీచర్‌లను అంతర్నిర్మితంగా అందిస్తుంది. మీరు ఇష్టపడే ఇదే Chrome వెబ్ బ్రౌజర్ అనుభవాన్ని మీ అన్ని పరికరాలలో ఆస్వాదించడం కోసం ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
తక్కువగా టైప్ చేస్తూ వేగంగా బ్రౌజ్ చేయండి. మీరు టైప్ చేసే సమయంలో తక్షణమే కనిపించే వ్యక్తిగతీకరించబడిన శోధన ఫలితాల నుండి ఎంచుకోండి, తద్వారా మునుపు సందర్శించిన వెబ్ పేజీలను సత్వరం బ్రౌజ్ చేయండి. ఆటోఫిల్ ద్వారా ఫారమ్‌లను త్వరగా పూరించండి.
అజ్ఞాత బ్రౌజింగ్. మీ చరిత్రను సేవ్ చేయకుండా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయడానికి అజ్ఞాత మోడ్‌ను ఉపయోగించండి. మీ అన్ని పరికరాలలోనూ ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయండి.
అన్ని పరికరాలలో Chromeను సింక్ చేయండి. మీరు Chromeకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీ బుక్‌మార్క్‌లు, పాస్‌వర్డ్‌లు, సెట్టింగ్‌లు ఆటోమేటిక్‌గా మీ అన్ని పరికరాలలో సింక్ చేయబడతాయి. మీరు మీ ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ నుండి మీ మొత్తం సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
ఒక్కసారి నొక్కితే మీకు ఇష్టమైన కంటెంట్ మొత్తం లభిస్తుంది. Chrome అంటే వేగవంతమైన Google శోధన మాత్రమే అని కాకుండా, మీరు ఒక్కసారి నొక్కితే మీకు ఇష్టమైన కంటెంట్ మొత్తం అందించే విధంగా రూపొందించబడింది. మీరు నేరుగా కొత్త ట్యాబ్ పేజీ నుండి మీకు ఇష్టమైన వార్తల సైట్‌లు లేదా సోషల్ మీడియాపై నొక్కవచ్చు. Chrome దాదాపు అన్ని వెబ్‌పేజీలలో “వెతకడం కోసం తాకండి” ఫీచర్‌ను కూడా అందిస్తుంది. మీరు ఏదైనా పదాన్ని లేదా పదబంధాన్ని నొక్కడం ద్వారా మీరు ఆస్వాదిస్తున్న పేజీలోనే ఉంటూనే Google శోధనను ప్రారంభించవచ్చు.
Google సురక్షిత బ్రౌజింగ్‌తో మీ ఫోన్‌ను కాపాడుకోండి. Chromeలో Google సురక్షిత బ్రౌజింగ్ అంతర్నిర్మితంగా ఉంటుంది. మీరు హానికరమైన సైట్‌లకు నావిగేట్ చేయడానికి లేదా హానికరమైన ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు హెచ్చరికలను చూపడం ద్వారా ఇది మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచుతుంది.
వేగవంతమైన డౌన్‌లోడ్‌లతో పాటు, వెబ్ పేజీలు మరియు వీడియోలను ఆఫ్‌లైన్‌లో వీక్షించండి Chromeలో ఒక ప్రత్యేకమైన డౌన్‌లోడ్ బటన్ ఉంటుంది, కాబట్టి మీరు ఒక్కసారి నొక్కడం ద్వారా సులభంగా వీడియోలు, చిత్రాలు మరియు మొత్తం వెబ్‌పేజీలను డౌన్‌లోడ్ చేయవచ్చు. Chrome లోపల డౌన్‌లోడ్‌ల స్థలం కూడా ఉంటుంది, కనుక మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నా కూడా మీరు డౌన్‌లోడ్ చేసిన మొత్తం కంటెంట్‌ను మీరు అక్కడ యాక్సెస్ చేయవచ్చు.
Google Voice శోధన. నిజంగా మీరు మాట్లాడగలిగే ఒక వెబ్ బ్రౌజర్‌ను Chrome మీకు అందిస్తుంది. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు చేతులు ఉపయోగించి టైప్ చేయాల్సిన పని లేకుండానే మీ వాయిస్‌ను ఉపయోగించి సమాధానాలను కనుగొనండి. మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా మీ వాయిస్‌ను ఉపయోగించి త్వరగా బ్రౌజ్ చేయవచ్చు, నావిగేట్ చేయవచ్చు.
Google అనువాదం అంతర్నిర్మితంగా ఉంటుంది: అన్ని వెబ్ పేజీలను క్షణాలలో అనువదిస్తుంది. Chromeలో Google అనువాదం అంతర్నిర్మితంగా ఉంటుంది కాబట్టి, మీరు ఒక్కసారి నొక్కడం ద్వారా మొత్తం వెబ్‌నీ మీ స్వంత భాషలోకి అనువదించవచ్చు.
వ్యక్తిగతీకరించబడిన స్మార్ట్ సిఫార్సులు. మీ ఆసక్తులకు అనుగుణంగా ఉండే అనుభూతిని Chrome మీకు అందిస్తుంది. కొత్త ట్యాబ్ పేజీలో, మీ మునుపటి బ్రౌజింగ్ చరిత్ర ఆధారంగా Chrome ఎంపిక చేసిన కథనాలను మీరు చూడవచ్చు.
అప్‌డేట్ అయినది
7 నవం, 2024