Lookout - సహాయక విజన్

4.1
3.78వే రివ్యూలు
500వే+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

కంటి చూపు సరిగ్గా లేని లేదా అంధత్వం ఉన్న వ్యక్తులకు, వారి పనులను వేగంగా, మరింత సులభంగా చేసుకోవడంలో సహాయపడేందుకు Lookout కంప్యూటర్ విజన్‌ను, జెనరేటివ్ AIని ఉపయోగిస్తుంది. మీ ఫోన్ కెమెరాను ఉపయోగించి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మరింత సమాచారాన్ని సులభంగా పొందడంలో Lookout సహాయపడుతుంది, ఇంకా టెక్స్ట్‌ను, డాక్యుమెంట్‌లను చదవడం, మెయిల్‌ను క్రమపద్ధతిలో అమర్చడం, కిరాణా సామాగ్రిని సర్దడం వంటి మరెన్నో రోజువారీ పనులను మరింత సమర్థవంతంగా చేయడంలో ఆ యాప్ సహాయపడుతుంది.

అంధులు, కంటి చూపు తక్కువగా ఉన్న వ్యక్తుల కమ్యూనిటీ సహకారంతో రూపొందించబడిన Lookout, ప్రపంచ సమాచారాన్ని విశ్వవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంచాలనే Google లక్ష్యాన్ని సపోర్ట్ చేస్తుంది.

Lookout ఏడు మోడ్‌లను అందిస్తోంది:

• <b>టెక్స్ట్:</b> టెక్స్ట్ మోడ్‌ను ఉపయోగించి మెయిల్‌ను క్రమపద్ధతిలో అమర్చడం, సైన్‌లను చదవడం వంటి పనులను చేసేటప్పుడు, ఈ యాప్ టెక్స్ట్‌ను స్కాన్ చేసి, బిగ్గరగా చదివి వినిపిస్తుంది.

• <b>డాక్యుమెంట్‌లు:</b> డాక్యుమెంట్‌ల మోడ్‌ను ఉపయోగించి, టెక్స్ట్ లేదా చేతిరాత గల మొత్తం పేజీని క్యాప్చర్ చేయండి. 30కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది.

• <b>అన్వేషణ:</b> అన్వేషణ మోడ్‌ను ఉపయోగించి, మీ చుట్టు పక్కల ఉన్న వస్తువులను, వ్యక్తులను, టెక్స్ట్‌ను గుర్తించండి.

• <b>కరెన్సీ:</b> కరెన్సీ మోడ్‌ను ఉపయోగించి బ్యాంక్‌నోట్‌లను వేగంగా, విశ్వసనీయంగా గుర్తించండి, ఈ మోడ్ US డాలర్‌లను, యూరోలను, భారతదేశ రూపాయలను సపోర్ట్ చేస్తుంది.

• <b>ఫుడ్ లేబుల్స్:</b> ఫుడ్ లేబుల్స్ మోడ్‌ను ఉపయోగించి, ప్యాక్ చేయబడిన ఆహారాలను, వాటి లేబుల్ లేదా బార్‌కోడ్‌ల ఆధారంగా గుర్తించండి. 20కి పైగా దేశాల్లో అందుబాటులో ఉంది.

• <b>సెర్చ్:</b> సెర్చ్ మోడ్‌ను ఉపయోగించి, తలుపులు, బాత్‌రూమ్‌లు, కప్పులు, వాహనాలు మొదలైన వాటిని కనుగొనడానికి మీ పరిసరాలను స్కాన్ చేయండి. పరికరంలోని సామర్థ్యాలను బట్టి, ఫలానా వస్తువు ఏ దిశలో ఉంది, ఎంత దూరంలో ఉంది అనే విషయాలను కూడా సెర్చ్ మోడ్ మీకు తెలపగలదు.

• <b>ఇమేజ్‌లు:</b> ఇమేజ్‌ల మోడ్‌ను ఉపయోగించి, ఏదైనా ఇమేజ్‌ను క్యాప్చర్ చేయండి, వివరించండి, అలాగే దాని గురించి ప్రశ్నలను అడగండి. ఇమేజ్ వివరణలు ఇంగ్లీష్‌లో మాత్రమే అందించబడతాయి. ఇమేజ్ ప్రశ్న & సమాధానం ఫీచర్, US, UK, కెనడా దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

30 కంటే ఎక్కువ భాషలలో Lookout అందుబాటులో ఉంది, Android 6, ఆపై వెర్షన్ ఉన్న పరికరాలలో ర‌న్ అవుతుంది. 2GB లేదా అంతకంటే ఎక్కువ RAM ఉన్న పరికరాలు సిఫార్సు చేయబడ్డాయి.

సహాయ కేంద్రంలో Lookout గురించి మరింత తెలుసుకోండి:
https://support.google.com/accessibility/android/answer/9031274
అప్‌డేట్ అయినది
15 మే, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, మెసేజ్‌లు ఇంకా 7 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.1
3.68వే రివ్యూలు

కొత్తగా ఏముంది

• AI-అందించే వివరణలను పొందడానికి, ఫోటోలను ఇమేజ్‌ల మోడ్‌లో క్యాప్చర్ చేయండి, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. US,• పనితీరు మెరుగుదలలు, బగ్ పరిష్కారాలు.