Android Accessibility Suite అనేది మీ Android డివైజ్‌ను కళ్లతో చూడకుండా కానీ, స్విచ్ డివైజ్‌తో కానీ ఉపయోగించడంలో సహాయపడే యాక్సెసిబిలిటీ యాప్‌ల కలెక్షన్.
Android Accessibility Suiteలో ఇవి ఉంటాయి:
• యాక్సెసిబిలిటీ మెనూ: స్క్రీన్‌పై ఉండే ఈ పెద్ద సైజ్‌లోని మెనూను ఉపయోగించి మీ ఫోన్‌ను లాక్ చేయండి, వాల్యూమ్‌ను, బ్రైట్‌నెస్‌ను కంట్రోల్ చేయండి, స్క్రీన్‌షాట్‌లు తీయండి, ఇంకా మరెన్నో చేయండి.
• వినడానికి ఎంచుకోండి: మీ స్క్రీన్‌పై ఉన్న ఐటెమ్‌లను ఎంచుకున్నప్పుడు, సిస్టమ్ వాటిని బిగ్గరగా చదివి వినిపిస్తుంది.
• TalkBack స్క్రీన్ రీడర్: మాటల ప్రతిస్పందన పొందండి, మీ డివైజ్‌ను సంజ్ఞలతో కంట్రోల్ చేయండి, స్క్రీన్‌పై ఉండే బ్రెయిలీ కీబోర్డ్‌తో టైప్ చేయండి.
ప్రారంభించడానికి:
1. మీ డివైజ్‌లోని సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
2. యాక్సెసిబిలిటీని ఎంచుకోండి.
3. యాక్సెసిబిలిటీ మెనూను, 'వినడానికి ఎంచుకోండి'ని, లేదా TalkBackను ఎంచుకోండి.
అనుమతుల నోటీస్
• ఫోన్: Android Accessibility Suite ఫోన్ స్టేటస్‌ను పరిశీలించి, మీ కాల్ స్టేటస్ ప్రకారం అనౌన్స్‌మెంట్‌లను సర్దుబాటు చేస్తుంది.
• యాక్సెసిబిలిటీ సర్వీస్: ఈ యాప్ యాక్సెసిబిలిటీ సర్వీస్ కాబట్టి, అది మీ చర్యలను గమనించగలదు, విండో కంటెంట్‌ను తిరిగి పొందగలదు, మీరు టైప్ చేసే టెక్స్ట్‌ను గమనించగలదు.
• నోటిఫికేషన్‌లు: మీరు ఈ అనుమతిని మంజూరు చేసినప్పుడు, TalkBack మీకు అప్‌డేట్‌ల గురించి తెలియజేయగలదు.
అప్‌డేట్ అయినది
30 సెప్టెం, 2025